NTV Telugu Site icon

Charminar Express: నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం.. 50 మందికి గాయాలు..

Train

Train

నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని ప్లాట్‌ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్టడంతో యాభై మందికి గాయాలు కావడంతో పాటు ఒకరు గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది. అయితే, ఈ ట్రైన్ చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ కు వస్తుండగా కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే రైల్వే శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు స్టార్ట్ చేసింది. ఇక, ప్లాట్ ఫారం సైడ్ వాల్ ను ఢీకొట్టడంపై రైల్వే అధికారులు విచారణ చేస్తామని చెప్పుకొచ్చారు. అసలు సైడ్ వాల్ కు ఎలా ఢీకొట్టింది అనే దానిపై రైల్వే అధికారులు విచారణ చేయనున్నారు. గాయపడిన యాభై మంది ప్రయాణికులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరగడంతో మిగిలిన రైళ్లు ఆలస్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.. కొంత మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.. అప్పటికే రైళ్లోని ప్రయాణికులు అందరూ దిగారు అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Read Also: Sankranthi Movies: సంక్రాంతి సినిమాల జాతకం తెలిసే రోజు వచ్చేసింది…

ఇక, నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ ప్రెస్ సైడ్ వాల్ ని తాకి భోగిలు పట్టాలు తప్పడంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ వ్యక్తం చేశారు. పట్టలు చిన్నగా పక్కకి ఒరగడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఘటనకు గల కారణాలపై అధికారులను పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. వెంటనే జిల్లా యంత్రంగా అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గాయపడిన ప్రయాణికులకు సరైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

https://youtube.com/live/vMCdNQaTPF4?feature=share