Charlapalli Suicide Case: చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి.. ఘటనలో మిస్టరీ వీడటం లేదు. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ డేటా బహర్గతం ఐతే.. ఏదైనా క్లూ దొరకొచ్చు అనుంటే… ఇక్కడా ఏం లభించలేదు. రెగ్యులర్ చాట్, అఫీషియల్ మెయిల్స్ తప్ప అనుమానాస్పద డేటా గుర్తించలేదు పోలీసులు. ఏం జరిగిందనే చిక్కుముడి వీడటం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా.. ఎక్కడా ఎలాంటి క్లూస్ లభించడం లేదు. మరి ముగ్గురు ఆత్మహత్య కేసులో చివరగా పోలీసులు ఏం తేల్చనున్నారు..?
READ MORE: Arava Sridhar Case: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్..
కుటుంబ కలహాలు లేవు.. ఆఫీసులో ఒత్తిడి లేదు… శత్రువులు లేరు.. తగాదాలు, వివాదాలూ అసలే లేవు!! మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు. తాను చేసుకుంటే చేసుకుంది కానీ.. ఇద్దరు పిల్లలనూ ఎందుకు చంపుకుంది. ఇద్దరినీ ఏమని చెప్పి ఆత్మహత్యకు ప్రేరేపించింది. పిల్లలు ఎలా ఒప్పుకున్నారు..? అంత బలమైన కారణం ఏమై ఉంటుంది..? ఇలా సవాలక్ష ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా… ఎక్కడా ఎలాంటి క్లూ లభించడం లేదు. ఆత్మహత్య చేసుకున్న విజయా రెడ్డి కారులో తాను రాసిన సూసైడ్ నోట్ లభించడం పెద్ద బ్రేక్ త్రూ. తన చావుకు ఎవరూ కారణం కాదని నోట్‌లో రాసింది విజయా రెడ్డి. కారులోనే ఉన్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీసీఎస్ పోలీసులకు పంపారు రైల్వే పోలీసులు. ఫోన్, ల్యాప్‌టాప్‌లో ఉన్న డేటా బహిర్గతం ఐతే.. అందులో ఉన్న డేటా ఆధారంగా ఏదో ఒక క్లూ లభిస్తుందని భావించారు పోలీసులు. కానీ.. వీటిలో కూడా ఎలాంటి అనుమానాస్పద డేటా గుర్తించలేదు పోలీసులు. ఫోన్‌లో రెగ్యులర్ చాట్స్, రెగ్యులర్ కాల్స్. ల్యాప్‌టాప్‌లో ఆఫీసు డేటా, అఫీషియల్ మెయిల్స్.. ఇవి తప్ప ఏం లేవు…
READ MORE: RCB vs DC Women Final: వడోదరలో 160+ టార్గెట్ ఛేజ్ అంటే అసాధ్యమే.. కప్ ఢిల్లీ క్యాపిటల్స్‌దే?
ఐతే పోలీసులు డే వన్ నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చనిపోవడానికి సిద్ధమైన రోజు విజయా రెడ్డి డే స్టార్టింగ్ నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లోని పూజ గదిలో పూజ నిర్వహించి.. ఇంటి నుంచి బయటకు బయల్దేరింది విజయ. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వచ్చినట్లు గుర్తించారు. తన సొంత కారులో తానే డ్రైవ్ చేసుకుంటూ.. ముందుగా కుమారుడు ఉండే హాస్టల్‌కి వెళ్లి.. తమ సమీప బంధువు ఒకరు చనిపోయారు, అర్జెంట్‌గా వెళ్లాలి.. తమ కొడుకును పంపండి అంటూ అడిగింది. అక్కడి నుంచి నేరుగా పఠాన్‌చెరులో కూతురు ఉండే హాస్టల్‌కి వెళ్లింది. అక్కడా ఇదే విషయం చెప్పి.. కూతురును కూడా పిక్ చేసుకుంది. ముగ్గురూ కలిసి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్‌లో కారు పార్కింగ్ చేసి.. తల్లికి కాల్ చేసింది. పిల్లలను తీసుకుని ఓ ఫంక్షన్‌కి వచ్చాను. రాత్రి రావడానికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది విజయ. తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ కారులోనే ఉంచింది. ప్లాట్‌ఫాం నెంబర్ వన్, ఫ్లాట్ ఫాం టు మధ్య చక్కర్లు కొట్టారు. ముగ్గురూ చాలాప్రశాంతంగా తిరగడం.. సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యింది. అర్ధరాత్రి దాటాకా.. ముగ్గురూ రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్లారు. అలా అర కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లి.. ట్రాక్ మధ్యలోకి చేరుకున్నారు. వరంగల్ రూట్‌లో ముగ్గురూ నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. ఐతే.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విజయ.. పిల్లలకు ఈ విషయం చెప్పిందా? లేదా? అనేది అనుమానాస్పదంగా మారుతోంది. ట్రాక్ మీద నడుస్తూ.. పిల్లలను మాటల్లో పెట్టి తీసుకుని వెళ్లిందా? అనేది మిస్టరీగానే ఉంది.
READ MORE: Chahal: “భారత్‌ను ఓడించే సత్తా వారికి మాత్రమే ఉంది”.. టీ20 వరల్డ్ కప్‌పై చహల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
విజయారెడ్డికి మంచి ఉద్యోగం.. లక్ష రూపాయల జీతం. ఇంటి అద్దెల ద్వారా మరికొంత ఆదాయం. పిల్లల భవిష్యత్తు కోసమే దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త జీతం కూడా విజయారెడ్డికే పంపుతున్నాడు. ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు. అప్పులు లేవు. ఆర్థిక లావాదేవీల్లో తగాదాలూ లేవు. ఇప్పటికే భర్తను, తమ్ముడిని, తల్లిని పలుమార్లు విచారించారు పోలీసులు. విజయ టీమ్ లీడర్‌గా ఉండటంతో.. సంస్థలో ఉన్న తోటి ఉద్యోగులను కూడా విచారించారు. ఎలాంటి క్లూస్ లభించలేదు. దాదాపు 800 కి పైగా సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. ఐనా ఎలాంటి ఆధారాలు గుర్తించలేదు పోలీసులు. రైల్వే పోలీసులతోపాటు.. లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విజయా రెడ్డి కూతురు, కొడుకు ఉండే హాస్టల్ కి వెళ్లి స్టూడెంట్స్, హాస్టల్ వార్డెన్ ద్వారా కూడా మరింత సమాచారం సేకరించారు. ఐనా.. పోలీసులు ఈ కేసులో చిక్కుముడి విప్పలేకపోతున్నారు..
