NTV Telugu Site icon

Charith Maanas: అచ్చం మేనమామ పోలికలే.. వైరల్ గా మారిన మహేష్ బాబు అల్లుడు..

Mahesh Babu

Mahesh Babu

టాలీవుడ్ హీరోలలో ఒకరైన సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు పద్మిని ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వీరిలో పెద్ద అబ్బాయి చరిత్ మానస్. ఆయన గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాడు. దీనికి కారణం చరిత్ మహేష్ బాబు లాగే కనిపించడం., అలాగే మహేష్ మేనరిజంతో కనిపించడంతో అనేకసార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

Crime News: అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులు.. యువకుడు అరెస్ట్

ఇప్పటికే పలుమార్లు మేనమామ పోలికలు బాగా వచ్చాయని., అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తే ఇట్లే అర్థమవుతుంది. ఇకపోతే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇదివరకు తన తండ్రి సుధీర్ బాబు సినిమాలోని నటించాడు. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఘట్టమనేని ఫ్యాన్స్ చరిత్ ను చూస్తే మాత్రం అచ్చం మహేష్ బాబు గుర్తుకొస్తున్నాడంటూ అనేక మార్లు సోషల్ మీడియాలో కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హీరో సుధీర్ బాబు వద్ద ప్రస్తావిస్తే అది కూడా మంచిదే కదా అని అన్నాడు. అంతేకాకుండా అతను భవిష్యత్తులో సినిమాల్లో కూడా రావచ్చు అంటూ సుధీర్ బాబు చెప్పగానే చెప్పాడు. ఇకపోతే మరో మారు మహేష్ మేనల్లుడు చరిత్ వైరల్ గా మారాడు.

Whatsapp Updates: అదిరిపోయే కాలింగ్ ఫీచర్స్ తో అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్..

నేడు సుధీర్ బాబు కొత్త సినిమా హరోం హర సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరిత్ తన స్నేహితులతో కలిసి హైదరాబాదు లోని ఏఎంబి మాల్ లోకి వెళ్ళగా.. అప్పుడు చరిత్ వెళుతున్న మేనరిజం చూస్తే.. అచ్చం మహేష్ బాబు ఎలా నడుస్తాడో అతను కూడా అలాగే నడుస్తున్నాడు. నిజం చెప్పాలంటే., టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికన్నా మహేష్ బాబు వాకింగ్ స్టైల్., అలాగే పరిగెత్తే విషయంలో కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఈ విషయంలో కూడా చరిత్ మహేష్ బాబును ఫాలో అవుతుండడంతో మహేష్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Show comments