Site icon NTV Telugu

Kurnoool: లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి.. జనంపై పడిన రథం

Kandanathi

Kandanathi

Kurnoool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతిలో లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవం జరుగుతుండగా పక్కకు ఒరిగి చుట్టూ వున్న జనంపై రథం పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రతియేటా విజయదశమి తరువాతి రోజు లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరుగుతుంది. కింది నుంచి కొండపైకి రథంను మోసుకుపోవడం సంప్రదాయంగా వస్తోంది. కొండపైకి రథాన్ని తీసుకెళ్తుండగా.. పక్కకి ఒరిగి జనంపై రథం పడింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి రథాన్ని కొండపైకి చేర్చారు.

Read Also: Alai Balai Program: మాట నిలబెట్టుకున్నారు.. సీఎం రేవంత్ కు గొంగడి కర్ర బహుకరించిన దత్తాత్రేయ..

Exit mobile version