Site icon NTV Telugu

Ryanair Flight: టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న విమానంలో అలారం.. రెక్కలెక్కి దూకిన ప్రయాణికులు (వీడియో)

Ryanair Flight

Ryanair Flight

రన్‌వేపై టేకాఫ్ కి సిద్ధంగా ఉన్న విమానంలో అకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడం ప్రారంభమైంది. దీంతో విమానం లోపల గందరగోళం నెలకొంది. ప్రయాణికులు ఏదో విధంగా విమానం నుంచి బయటపడటానికి ప్రయత్నించారు. విమానంలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చి విమానం రెక్కలపైకి ఎక్కి కిందకు దూకారు. రెక్కలపైకి ఎక్కి రన్‌వేపైకి దూకుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE: Dil Raju : అన్నీ సెట్ చేస్తే, రెండేళ్లలో ఇండస్ట్రీ పుంజుకుంటుంది !

ఈ సంఘటన రైనాయర్ విమానానికి సంబంధించినదని తెలుస్తోంది. విమానంలో సాంకేతిక లోపం వల్ల అగ్ని ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు చెబుతున్నారు. అల్లారం అనంతరం జరిగిన గందరగోళంలో బయటకు దూకి18 మంది గాయపడ్డారు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. జూలై 5న రాత్రి.. మజోర్కా( స్పెయిన్‌లోని బాలియారిక్ దీవులలో అతిపెద్ద ద్వీపం)లోని పాల్మా విమానాశ్రయంలో మాంచెస్టర్‌కు వెళ్లే విమానంలో “ఫైర్ వార్నింగ్” జారీ చేయబడింది. అగ్నిమాపక దళం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు కొంతమంది ప్రయాణికులు విమానం రెక్కలపైకి ఎక్కి రన్‌వేపైకి దూకారు. ఈ తొందరపాటులో 18 మంది గాయపడ్డారు. అందులో ముగ్గురిని పాల్మాలోని క్లినికా రోట్జర్ అనే ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. మరో ముగ్గురిని క్విరోన్‌సలుడ్ పాంప్లెమౌసెస్‌కు తరలించారు. అనంతరం ఈ విమానం టేకాఫ్‌ను రద్దు చేశామని, ప్రయాణికులను దింపి టెర్మినల్‌కు తిరిగి తీసుకొచ్చినట్లు సిబ్బంది తెలిపారు.

READ MORE: Minister Kollu Ravindra: ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ఈరోజు నీతులు చెబుతున్నారు!

Exit mobile version