Site icon NTV Telugu

Chandrayaan-3: ల్యాండింగ్ తర్వాత చంద్రుడి తొలి చిత్రాన్ని పంపిన చంద్రయాన్‌-3

Isro

Isro

Chandrayaan-3: చంద్రుడి మీద విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత చంద్రయాన్‌-3 తొలి చిత్రాన్ని విడుదల చేసింది. ల్యాండ్‌ అయిన తర్వాత విక్రమ్‌ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్‌ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్‌ సెంటర్‌తో ల్యాండర్‌ కమ్యూనికేషన్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ట్విటర్‌లో ఇస్రో ఇలా రాసుకొచ్చింది.” చంద్రయాన్‌-3 ల్యాండర్, బెంగళూరు రీసెర్చ్‌ సెంటర్‌ మధ్య లింక్ ఏర్పాటు చేయబడింది. ల్యాండింగ్‌ సమయంలో ల్యాండర్‌ తీసిన ఫొటోలు ఇక్కడ ఉన్నాయి.” అని ఇస్రో తెలిపింది.

Read Also: PM Calls ISRO Chief: చంద్రయాన్‌-3 సక్సెస్ తర్వాత ఇస్రో ఛీఫ్‌కు ప్రధాని ఫోన్‌.. వీడియో వైరల్

ఇస్రో చరిత్ర సృష్టించింది… జాబిలమ్మపై అడుగుపెట్టి సత్తా చాటింది.. భారత్‌ మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం ఇస్రోపై ప్రశంసలు కురిపిస్తోంది.. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది చంద్రయాన్‌-3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది.. ఇక, చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.. దీంతో.. ఇస్రోతో పాటు భారత్‌ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దృక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. చంద్రయాన్‌-3 నుంచి ఇస్రోకు చేరిన తొలి మెసేజ్‌ ఏంటి అంటే.. ”నేను నా గమ్యాన్ని చేరుకున్నా.. మీరు (భారత్‌, ఇస్రో) కూడా”.. అంటూ మెసేజ్‌ను పంపింది. ఇక, దీనిని ఇస్రో ధృవీకరించింది. చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని ప్రకటించింది.. భారతదేశానికి అభినందనలు అంటూ ట్వీట్‌ చేసింది.

చంద్రుని అన్వేషణ చరిత్రలో అమెరికా, రష్యా, చైనా తర్వాత రోవర్‌ను విజయవంతంగా దింపిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ అవతరించింది.చంద్రయాన్-3 మిషన్ చంద్రుని భూగర్భ శాస్త్రం, దాని నీటి వనరులు, భవిష్యత్తులో మానవ అన్వేషణకు దాని సామర్థ్యాన్ని అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version