Chandrayaan-3: వచ్చే ఏడాది చంద్రయాన్-3.. వెల్లడించిన ఇస్రో ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: జీఎస్ఎల్వీ (జియోసింక్రోనస్ లాంఛ్ వెహికిల్) మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్ -3 ప్రయోగానికి దాదాపు అంతా సిద్ధమైందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమ్ నాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ లో రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తుది ఏర్పాట్లలో భాగంగా చిన్నచిన్న పరీక్షలు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. వచ్చే ఏడాదిలో ఫిబ్రవరితో పాటు జూన్ లో రాకెట్ ప్రయోగానికి స్లాట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ లోనే చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇస్రో చైర్మన్ మాట్లాడారు.
Read Also: Narayana Murthy : సీఎంకు ధన్యవాదాలు చెప్పిన పీపుల్స్ స్టార్.. ఎందుకంటే..?
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
చంద్రయాన్-2 తో పోలిస్తే చంద్రయాన్-3 మిషన్ ను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు వివరించారు. 2019లో చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ చివరి క్షణంలో ఫెయిల్ అయింది. చంద్రుడిపైన దిగే సమయంలో ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫెయిల్యూర్ నేర్పిన పాఠాలతో చంద్రయాన్-3 మిషన్ ను తీర్చిదిద్దినట్లు సోమ్ నాథ్ తెలిపారు. శనివారం ప్రయోగించిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టిందని సోమ్ నాథ్ వివరించారు. నిజానికి చంద్రయాన్-3ని ఈ ఏడాది ఆగష్టులో ప్రయోగించాల్సి ఉంది. అయితే, కోవిడ్ వల్ల ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. దీంతో వచ్చే ఏడాది జూన్‌లో చేపట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
Read Also:Nithya Menon : దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నిత్యామీనన్
ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్టుల వివరాల్ని సోమ్‌నాథ్ తాజాగా మీడియాకు వెల్లడించారు. ‘‘చంద్రయాన్-2కు చంద్రయాన్-3 కి సంబంధం లేదు. ఇది కొత్త నమూనా. దీని నిర్మాణం చాలా కొత్తది. గతంలోలాగా సమస్యలు తలెత్తకుండా మరింత సమర్ధంగా దీన్ని తయారు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. మరోవైపు భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపే గగన్ యాన్ ప్రాజెక్టుపై ఇస్రో పని చేస్తోందన్నారు. ఈ ప్రాజెక్టును 2024లో చేపడతామని చెప్పారు. దీనిలో భాగంగా తొలి అబార్ట్ మిషన్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహిస్తామన్నారు. ఇక, ఇంతకుముందు 2019, సెప్టెంబర్‌లో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ ప్రక్రియ సరిగ్గా కాకపోవడంతో ఇది విఫలమైంది. అయితే, ఇది ఇప్పటికీ చంద్రుడిపై పని చేస్తోంది.
- Tags
- Chandrayaan 3
- GSLV
- ISRO
- mk 3
- satilite
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!