Chandrayaan-3: భారతదేశ అంతరిక్ష పరిశోధణ సంస్థ (ఇస్రో) చంద్రునిపైకి తన తాజా మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు ప్రయోగించనుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి భారతదేశం లాంచ్ వెహికల్ మార్క్ -3 (LVM3) రాకెట్‌లో లిఫ్ట్ ఆఫ్ అవుతుంది. అయితే.. ఈ నేపథ్యంలో శ్రీహరికోటలో ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ సమావేశం నిర్వహించారు.. చంద్రయాన్-3 ప్రయోగంపై శాస్రవేత్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.. రాకెట్‌లోని అన్ని భాగాలు సవ్యంగా పనిచేస్తున్నట్టు నివేదిక అందింది.
Read also: Anchor Suma: అయ్యో పాపం సుమకు ఎంత కష్టమొచ్చిందో..!
కాగా, ఈ నెల 13వ తేదీన చంద్రయాన్ ప్రయోగం ఉంటుందంటూ ముందుగా అనుకున్నా.. ఆ తర్వాత మూన్ మిషన్ ప్రయోగం ఒక రోజు వెనక్కి నెట్టబడింది.. ఈ ప్రయోగం జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది.. దీంతో.. చంద్రయాన్ ప్రయోగం కోసం మరో రోజు వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. ఈ ప్రయోగం ఇప్పుడు జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో జరగనుంది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రయోగం తర్వాత రెండు నెలలపాటు ప్రయాణించనున్న స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌తో దాని జర్నీ ముగుస్తుంది. ఆ తర్వాత జాబిల్లపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలోనూ చంద్రయాన్ మిషన్లు చేపట్టింది. మొత్తం ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 ప్రయోగం కోసం ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. ఇప్పుడు కూడా సాఫ్ట్‌ల్యాండింగ్ ఏమంత సులభం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ మూన్ మిషన్‌కు సంబంధించిన స్పెషల్ రిపోర్ట్ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
