Site icon NTV Telugu

Chandrahass:’గుంజీ గుంజీ’ పాటపై విమర్శలకు చంద్రహాస్‌ రిప్లై.. ‘బరాబర్ సారీ చెప్పా’..

Chandrahass

Chandrahass

Chandrahass:’బరాబర్‌ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు చంద్రహాస్‌ పాడిన ‘గుంజీ గుంజీ’ పాటపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ రేపుతుంది. సీనియర్‌ నటుడు జేడీ చక్రవర్తి కూడా ఈ పాటను విమర్శించడంతో దీనిపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ చిత్రానికి ఈ రగడ ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అసలు ఏం జరిగిందంటే.. ‘బరాబర్‌ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చంద్రహాస్‌ లైవ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. ‘గుంజీ గుంజీ’ అనే పాటను పాడుతూ అక్కడున్న ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అయితే ఈ పాటలోని కొన్ని లిరిక్స్‌ వల్ల ఈ వివాదం మొదలైంది. ఆ పాట పడుతున్న సమయంలో స్టేజ్‌పై ఉన్న జేడీ చక్రవర్తి షాక్‌ అయ్యారు. తాజాగా ఈ పాటపై జేడీ చక్రవర్తి వివరణ ఇస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

READ ALSO: Mega158 Cast: చిరంజీవి 158కు ‘మెగా’ క్యాస్టింగ్‌.. ఫుల్ లిస్ట్ ఇదేనా?

ఈ క్రమంలో పాటపై వస్తున్న విమర్శలకు ‘బరాబర్‌ ప్రేమిస్తా’ హీరో చంద్రహాస్‌ కూడా ఘాటుగా స్పందించాడు. ఆయన రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. “ఈ పాట 3.5 నిమిషాలది. కానీ విమర్శకులు కేవలం 5 సెకన్లు క్లిప్‌ చేసి అసభ్యమంటున్నారు. తెలుగు సినిమాల్లో బీప్‌ సౌండ్‌లు సర్వసాధారణం. నేను ఏమీ తప్పు చేయలేదు, అందుకు క్షమాపణలు చెప్పను” అని ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో చంద్రహాస్‌ తన పెర్ఫార్మెన్స్‌పై రిగ్రెట్‌ లేదంటూ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్‌ మీడియాలో హాట్‌ డిస్కషన్‌గా మారింది. కొందరు చంద్రహాస్‌ను సపోర్ట్‌ చేస్తుంటే, మరికొందరు ఈ పాటపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా ఈ రగడ ‘బరాబర్‌ ప్రేమిస్తా’ సినిమాకు మంచి పబ్లిసిటీ ఇచ్చినట్లు అయ్యిందని అంటున్నారు. మరి ఈ ‘గుంజీ గుంజీ’ పాట వివాదం ఎలా ముగుస్తుందో వేచి చూడాల్సిందే!

READ ALSO: Eesha Rebba: పోలీసు స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ ఈషారెబ్బ.. ఆ వ్యక్తి వేధింపులే కారణమా?

Exit mobile version