NTV Telugu Site icon

AP High Court: స్కిల్ డెవలప్ మెంట్ స్కాం.. ఎఫ్ఐఆర్ కొట్టేయాలని చంద్రబాబు తరపున క్వాష్ పిటిషన్..

Ap High Court

Ap High Court

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం లో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున న్యాయవాదులు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు విచారణ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రిమాండ్ ను సవాల్ చేస్తూ వేసిన రివ్యూ రివిజన్ పిటిషన్ లోనే క్యాష్ పిటిషన్ కూడా కలిపి వేసిన చంద్రబాబు తరపు లాయర్లు.

Read Also: Medical Seats: ఏపీ విద్యార్థులకు షాక్..! ఆ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే..

అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై రాజకీయ కోణంతోనే కేసు పెట్టారని ఆయన తరపు లాయర్లు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక, రేపు కోర్టు నంబర్ 4లో ఈ కేసు విచారణకు రానుంది. ఈ పిటిషన్ కు సంబంధించి చంద్రబాబు సంతకం కావాల్సి ఉండటంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఏపీ హైకోర్టు అడ్వకెట్ లక్ష్మీ నారాయణ వెళ్లి కలినట్లు తెలుస్తుంది. ఆ సంతకాల ప్రక్రియ ముగిసిన తర్వాత తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు. ఈ కేసులో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి ధర్మాసనం ముందుకు రానుంది.

Read Also: Kuldeep Yadav: ఈ స్పెల్‌ జీవితాంతం గుర్తుండిపోతుంది: కుల్దీప్

17ఏ ప్రకారం రాష్ట్ర గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును ఎలా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారని ఈ పిటిషన్ లో చంద్రబాబు తరపు లాయర్లు పేర్కొన్నారు. ఇక, ఈ రెండు అంశాలకు సంబంధించి రేపు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. ఇది కూడా ఈ కేసులో కీలకమైనది. ఇప్పటి వరకు చంద్రబాబుకు సంబంధించిన అన్ని కేసులు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంటే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి సారి ఏపీ హైకోర్టుకు వచ్చాయి.