విశాఖలో కేంద్ర సహాయ మంత్రి దేవ సింహ్ చౌహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సరైన సమయంల్లో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
Read Also: IND vs SL Final: ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా.. భారత్ బౌలర్లు మెరుపు దాడి
భగవాన్ విశ్వ కర్మ జయంతి రోజున ప్రధాని మోడీ పుట్టిన రోజు జరగడం ఆనందంగా ఉందని దేవ సింహ్ చౌహన్ తెలిపారు. సామాజిక, ఆర్ధిక ప్రగతికి కేంద్ర పథకాలు దోహదం చేస్తున్నాయన్నారు. సరికొత్త భారత్ ఆవిష్కరణకు బీజేపీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. బీజేపీకి ఇంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే 2024లో అధిక మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఆయన అన్నారు.
Read Also: IND vs SL Final: ఆసియా కప్ గెలిచిన భారత్.. ట్విటర్లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
మరోవైపు జీ20 సదస్సును నిర్వహించి ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకునేలా చేసామని పేర్కొన్నారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసామని తెలిపారు. దీని ఫలితంగా టూరిజం పెరుగుతుందని.. వసుదేవ కుటుంబ నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కేవలం నెంబర్ గేమ్ లో మాత్రమే తమకు వ్యతిరేకం వచ్చిందని అన్నారు. ఇదిలా ఉంటే.. సనాతన ధర్మం కోసం కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. దేశ ఔన్నత్యాన్ని పెంపొందిస్తున్న విధానాల మీద వాఖ్యలు చేయడం దారుణమని దేవ సింహ్ చౌహన్ అన్నారు.