ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అయితే నేడు ( మంగళవారం ) గద్దర్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు వెంట టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గద్దర్ చనిపోవడం బాధాకరం.. ఆయన ఒక వ్యక్తి కాదు వ్యవస్థ.. ప్రజా చైతన్యంతో మొదట గుర్తు వచ్చే వ్యక్తి గద్దర్ అని ఆయన తెలిపారు.
Read Also: Mohan Babu: ఆ మాట అంటే చెప్పు తీసుకుని కొడతానన్నా!
గద్దర్ పాట, ఆయన కృషి ఎప్పటికి మర్చిపోలేము అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి.. రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యం కోసం పని చేస్తే… గద్దర్, ప్రజలు, పేదల హక్కుల పరిరక్షణ కోసం ఒక పందా ఎన్నుకొని కృషి చేసారు అని చంద్రబాబు అన్నారు. పోరాటాలకు నాంది పలికారు.. తెలంగాణ పోరాటంలో ఎంతో కృషి చేసారు.. ఆయనను చూస్తేనే ప్రజా యుద్ధ నౌక గుర్తు వస్తుంది అని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు.
Read Also: Independence Day: సముద్రం లోపల జాతీయ జెండా .. వీడియో వైరల్
గద్దర్ దేనికి భయపడని వ్యక్తి.. పొరటలే ప్రాణంగా ఆయన బతికారు అని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన స్ఫూర్తి శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఆయన త్యాగాల ఫలితం లక్షల అభిమానులను సంపాదించుకున్నారు.. పెద్ద వయసు కాదు గద్దర్ ది.. తెలుగు జాతి మంచి ఉద్యమ కారున్ని కోల్పోయింది.. ఆయన మృతి చాలా బాధ, ఆవేదన కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని చంద్రబాబు అన్నారు.
Read Also: Bhagavanth Kesari: అన్న హరికృష్ణ సినిమానే బాలయ్య రీమేక్ చేస్తున్నాడా?
గద్దర్ ను భయం అంటే తెలియని వ్యక్తిగా చంద్రబాబు అభివర్ణించారు. 1997లో గద్దర్ పై కాల్పులు ఘటనపై ఈ సందర్భంగా చంద్రబాబు స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపాడు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్.. నాతో అనేక సార్లు మాట్లాడారు.. నా లక్ష్యం.. గద్దర్ లక్ష్యం ఒక్కటే.. పేదల హక్కుల పరిరక్షణమే మా ధ్యేయం అని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ అభివృద్దికి కారణం ఎవరో అందరీ తెలుసు.. హైదరాబాద్ అభివృద్ధి ఫలాలు తెలంగాణలో ప్రతి ఒక్కరకీ అందుతున్నాయి.. గద్దర్ ఎన్నో ప్రజా పోరాటాలకు నాంది పలికారు.. గద్దర్ జీవితం భావి తరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందన్నారు.
