NTV Telugu Site icon

Chandrababu: నేడు సీఐడీ ఆఫీస్‌కి చంద్రబాబు..

Cid

Cid

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, లిక్కర్‌, ఇసుక కేసుల్లో ఇప్పటికే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఇదే సమయంలో కొన్ని షరతులు విధించింది.. వారం రోజుల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.. ఇక, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. నేడు సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్న చంద్రబాబు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్), లిక్కర్‌ స్కామ్‌, ఇసుక కుంభ కోణం కేసుల్లో పూచీకత్తు సమర్పించనున్నారు.

Read Also: Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలు తీరుతాయి..

కాగా.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే.. ఈ కేసులో 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఆయన డిమాండ్‌లో ఉన్నారు. ఇదే సమయంలో.. చంద్రబాబుపై పలు అభియోగాలు మోపింది సీఐడీ.. వరుసగా ఐఆర్ఆర్, లిక్కర్‌, ఇసుక, ఫైబర్‌ నెట్‌.. ఇలా కేసులు నమోదు చేస్తూ వచ్చింది.. ఇక, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మొదట మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చంద్రబాబు.. ఆ తర్వాత ఈ కేసులో హైకోర్టులో పూర్తిస్థాయి బెయిల్‌ పొందారు.. ఆ తర్వాత.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, లిక్కర్‌, ఇసుక కేసులో ముందస్తు బెయిల్‌ వచ్చింది.. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.