Site icon NTV Telugu

Chandrababu Delhi Tour: నేడు ఢిల్లీకి చంద్రబాబు… విషయం ఇదే..!

Babu 2

Babu 2

Chandrababu Delhi Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్‌ విక్టరీ సాధించింది.. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్.. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Read Also: Lok Sabha Elections2024: చిన్న వయసులో ఎంపీలుగా రికార్డు.. ముగ్గురూ ఒకే రాష్ట్రం..ఒకే పార్టీ

కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బంపర్‌ విక్టరీ కొట్టింది.. అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ మెజార్టీ సాధించింది. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీల అధ్యక్షులు పాల్గొననున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన బీజేపీ.. ఈ సారి మాత్రం ఆ మార్క్‌ను చేరుకోలేకపోయింది.. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయ్యింది.. దాంతో, ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ.. ఈ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్‌ కుమార్‌ సహా కూటమిలోని ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు.

Read Also: AP CID Chief Sanjay: సెలవుపై విదేశాలకు ఏపీ సీఐడీ చీఫ్‌..

ఇక, ఎన్డీఏ కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకి సొంతంగా 241 సీట్లు వచ్చాయి.. 16 సీట్లతో టీడీపీ రెండో స్థానంలో ఉంది.. 12 సీట్లతో జేడీయూ మూడో స్థానంలో ఉంది.. చంద్రబాబు, నితీష్‌ కుమార్‌.. ఇప్పుడు ఎన్డీఏలో కింగ్‌ మేకర్లు.. ఎన్డీఏ కూటమిలో వారి పాత్ర కీలకంగా మారింది.. దాంతో.. ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ సమావేశంలోనే ఎన్డీఏ కన్వీనర్‌ని ఎన్నుకునే అవకాశం ఉంది. మరో వైపు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డాను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గ్రాండ్‌ విక్టరీ కొట్టడంతో మరోసారి ముఖ్యమంత్రి కానున్నారు చంద్రబాబు.. ఆయన ప్రమాణస్వీకారానికి ఢిల్లీ పెద్దలను కూడా ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు.

Exit mobile version