Chandrababu: ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వంగవీటి రాధా అని.. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. దెందులూరులో చింతమనేని అభిమానులు ఎక్కువ ఈలలు వేస్తారు తక్కువ పని చేస్తారు.. ఇకనుంచి ఎక్కువ పని చేయాలన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. నాయకుడు అంటే సింహాలు, పులులు అని చెప్పడం కాదు సమర్థవంతమైన పాలు అందించేవాడు నాయకుడన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేసేవాడు నాయకుడు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని వాడు నాయకుడు కాదన్నారు. కార్యకర్తలు తప్పుడు కేసులకు భయపడొద్దని.. పెట్టిన కేసులకు వడ్డీతో సహా తీర్చే బాధ్యత నాది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read Also: CM YS Jagan: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
నాయకుడంటే సమర్థవంతమైన పరిపాలన ఇవ్వాలని, దూరదృష్టి ఉండాలని ఆయన అన్నారు. కేవలం బటన్ లో నొక్కడానికి ఓ ముఖ్యమంత్రి అవసరమా.. నిందితులను బాధితులుగా .. బాధితులను నిందితులుగా చేసే ప్రభుత్వం ఇది అని ఆయన ఆరోపించారు. నల్ల చట్టం వస్తే మీ ఆస్తులకు యజమాని జగన్ అవుతారని ఆరోపణలు చేశారు. కరెంటు చార్జీలు పెంచాను అని చెప్పిన దుర్మార్గుడు చార్జీలు పెంచుతూనే ఉన్నాడన్నారు. ఎన్నికల ముందు డీఎస్సీ పెడతా, జాబ్ క్యాలెండర్ పెడతా అన్నాడని.. ఏదీ అంటూ ప్రశ్నించారు. దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లండన్ నుంచి వచ్చాడని.. అభివృద్ధి చేయడం మానేసి పేకాట కంపెనీ తెచ్చాడని, జూదం కంపెనీ తెరిచాడని విమర్శించారు. పోలవరం గట్టు కూడా తవ్వేసుకున్నారు.. కొల్లేరులో అక్రమ చెరువులు తవ్వేసుకున్నారని ఆయన ఆరోపించారు. తండ్రి కొడుకులు దందాలు చేసే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకి తగ్గిస్తామన్నారు.