NTV Telugu Site icon

Chandrababu: వైసీపీ రాతియుగం కావాలా.. టీడీపీ స్వర్ణయుగం కావాలా..

Chandrababu Naidu

Chandrababu Naidu

టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ‘రా కదలిరా’ సభలో పాల్గొన్నారు. ఈ సభకు భారీగా కార్యకర్తలు, జనాలు రావడంతో.. చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ జనాన్ని చూసి తాడేపల్లి పిల్లి వణికిపోతోందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు పివి నరసింహారావును పార్లమెంట్ కి పంపితే ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. పివి నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. ఎన్టీఆర్ జనవరి 9న అధికారం చేపడితే, ఇదే రోజు ఆళ్లగడ్డలో సభ నిర్వహించుకుంటున్నామన్నారు. మరోవైపు.. ఐదేళ్ల వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. వైసీపీ రాతియుగం కావాలా.. టీడీపీ స్వర్ణయుగం కావాలా అని చంద్రబాబు జనాలను ప్రశ్నించారు.

Kesineni Nani: కేశినేని భవన్కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు..

మరోవైపు.. జగనన్న వదిలిన బాణం అని షర్మిల రాష్ట్రమంతా తిరిగింది.. ఇప్పుడు ఆ బాణం ఎక్కడ తిరిగిందో తెలుసా అని చంద్రబాబు ప్రశ్నించారు. షర్మిలకు ఆస్తి ఇవ్వు.. మీరు మీరు గొడవ పడి నా మీదకు వస్తారా అని దుయ్యబట్టారు. రాజశేఖర్ రెడ్డి మా ఫ్రెండ్.. ఇక్కడే చనిపోయాడు.. వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి రామలక్ష్మణుల్లా వుండేవారని తెలిపారు. వివేకానంద రెడ్డిని ఏమి చేశారు.. వివేకానంద రెడ్డి హత్యకు గురైతే కూతురుపై కేసు పెట్టారని ఆరోపించారు. వైఎస్సార్ ను హత్య చేసిందని షర్మిలపై ఇవ్వాలో రేపో కేసు పెట్టినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్ అన్ని ధరలు పెరిగాయి.. అధికారంలోకి వచ్చాక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. నంద్యాల జిల్లాలో 7 స్థానాలు తామే గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

Nandigama Suresh: వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..

ఈ సభలో చంద్రబాబు భస్మాసురుని కథ వినిపించారు. ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర సైకో జగన్ ది అని మండిపడ్డారు. ప్రజావేధిక కూల్చి విధ్వంస పాలనకు దోహదం చేసాడు.. మధమెక్కి అహంభావంతో అధికారం వచ్చిందని ఇష్టం వచ్చినట్లు వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. తనపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాయలసీమకు ఒక ప్రాజెక్టు కట్టారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు గతంలో పెట్టిన ఖర్చులో 20 శాతమైనా వచ్చాయా అని అన్నారు. డ్రిప్ 90 శాతం సబ్సిడీతో ఇచ్చాము.. ఇపుడు డ్రిప్ లేక 4 లక్షల ఎకరాల హార్టికల్చర్ తగ్గిపోయిందని పేర్కొన్నారు. జగన్ ప్రజల ఆస్తుల రికార్డులు తారుమారు చేసి అమ్ముకోవాలని చూస్తున్నారని తెలిపారు. నా జీవితం తెలుగు జాతికి అంకితం.. నేనుంటే రెడ్లు, బీసీలు, మైనార్టీలు, దళితులు అందరూ బాగుపడేవాళ్ళని చంద్రబాబు అన్నారు.