Site icon NTV Telugu

Chandrababu: తెలుగు ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు

Chandrababu

Chandrababu

Chandrababu: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలికి.. స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామన్నారు. సంక్రాంతి కేవలం ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదు.. జీవితాల్లో కూడా మంచి మార్పునకు కూడా సంకేతమేనన్నారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలనతో ప్రతి ఒక్కరి జీవితం చీకటి మయం అయ్యిందన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల్లేవన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేని కుటుంబాలున్నాయన్నారు. అస్తవ్యస్తమైన రోడ్లు, భయపెడుతున్న ఆర్టీసీ ఛార్జీలు గ్రామాల్లో పండుగ శోభను దెబ్బతీశాయన్నారు. ప్రతి పేద కుటుంబం పండగలను ఆనందంగా జరుపుకోవాలని టీడీపీ హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసి పండుగ సంతోషాలను ప్రజలకు దూరం చేసిందన్నారు. ప్రభుత్వ విధ్వంసకర, విద్వేష విధానాలతో ఉపాధి కూడా దొరక్క యువత రోడ్డున పడిందన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని అటకెక్కించారని చంద్రబాబు పేర్కొన్నారు.

Exit mobile version