Site icon NTV Telugu

Chandrababu: వచ్చే ఎన్నికలలో ప్రజలు గెలవాలి.. ధర్మం గెలవాలి

Chandrababu

Chandrababu

చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళుగా పేదలపై భారం మోపుతూ.. బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు.. రెండు వందలు వస్తున్న కరెంట్ బిల్లు వెయ్యి దాటి రెండువేల వరకు వెళ్ళిందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు ధరకు ఆఖరికి చెత్త పన్ను వేశాడని సీఎం జగన్ పై దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ పై పోరాటం చేస్తామన్నారు. మరోవైపు.. దేశంలో ఉన్న ప్రతి ఒక్క నేత టీడీపీకి సపోర్టు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.

Rythu Bharosa: ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే..

జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నాడు.. కేసుల కోసం ఒప్పందం చేసుకున్నాడని చంద్రబాబు దుయ్యబట్టారు. తాము రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు గెలవాలి.. ధర్మం గెలవాలి అని పేర్కొన్నారు. మరోవైపు.. పుంగనూరులో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చంద్రబాబు ఆరోపించారు. అరాచకాలు హెచ్చు మీరాయి.. తన పైన దాడి చేసి, వాహనాలు ధ్వంసం చేసి తిరిగి తనపైనే కేసులు పెట్టారని చంద్రబాబు తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అత్యవసర చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో టీడీపీకి ఉద్యోగులు కసిగా ఓటు వేశారన్నారు. ఉద్యోగులు కంటే కసిగా ప్రజలు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. టీడీపీకి ప్రజలు ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారని పేర్కొన్నారు.

Supreme Court: బెంగాల్ టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే

Exit mobile version