అమరావత రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి అని పేర్కొన్నారు. దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టింది.. అమరావతే మన రాజధాని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోంది.. ఇక్కడే రాజధాని ఉంటుందని టీడీపీ – జనసేన పార్టీలు భరోసా ఇస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సంక్రాంతి రోజున అంగన్వాడీలను రోడ్డున పడేశాడు.. యునతకు ఉపాధి కల్పించేలా టీడీపీ – జనసేన పార్టీ భరోసా ఇస్తుంది.. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత మా రెండు పార్టీలదే.. కరవు మండలాలను కూడా పట్టించుకోకుండా కేంద్ర సాయం కూడా రాకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం అని చంద్రబాబు అన్నారు.
Read Also: Satavahana Express Train: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికులు పరుగులు
చీకటి జీవోలను మంటల్లో వేశామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. జగన్ అహంకారాన్ని కూడై మంటల్లో వేశాం.. భస్మాసురునికి వరం ఇచ్చినట్టు జగనుకు ప్రజలు ఓటేశారు.. పోలీసులను నేనేం అనలేను కానీ.. ప్రభుత్వం ఒత్తిడి వల్ల రాక్షసుల్లా పోలీసులు వ్యవహరించారు.. ఇదే పోలీసులు మీకు జిందాబాద్ కొట్టే పరిస్థితి వస్తుంది అని ఆయన అన్నా. ఏపీలో జరుగుతున్న అరాచరాలను కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.. ప్రపంచంలో మూడు రాజధానులనేవి ఎక్కడా లేదు అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Pawan Kalyan: మరోసారి ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ చీకటే
విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు అన్నారు. కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం.. విశాఖ, కర్నూలు నగరాలకు పూర్వ వైభవం తెస్తాం.. అమరావతిలో ఉంది ఏ ఒక్క కులం.. ఏ ఒక్క వర్గమో కాదు.. అమరావతి కోసం సంక్రాంతి సంకల్పం చేయాలి.. నాది, పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఒకటే.. పోలీసులు దుర్మార్గుడి చేతిలో బలయ్యారు.. సంక్రాంతి సంకల్పం ముందుగా తీసుకోవాల్సింది పోలీసులే..పోలీసులు తమ బిడ్డల కోసం ఆలోచించాలి.. సంక్రాంతి సంకల్పం తీసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఇవాళ పండుగ భోగి.. పాలకుడు మానసిక రోగి.. ఆ మానసిక రోగిని మార్చాలి.. ఇంకేం అనుమానం అక్కర్లేదు.. మంచి రోజులు వచ్చేశాయి.. రాజకీయల్లో ఉండడానికే అర్హత లేని వ్యక్తి జగన్ అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.