NTV Telugu Site icon

Chandrababu: పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజాసేవ

Chandrababu

Chandrababu

కృష్ణాజిల్లాలోని నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. పేదరిక నిర్మూలనకు తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ లక్ష్యాలను ఆవిష్కరించారు. నిమ్మకూరు గ్రామంలో నందమూరి వంశీకులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సంపద సృష్టించి, అది పేదలు అనుభవించేలా చేయటమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. మన ఊరు పిల్లలు ప్రపంచానికి పని చేసి డబ్బులు సంపాదించే విధానం ఈ ప్రాజక్టులో ఓ భాగం మాత్రమే.. పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజా సేవ చేశారు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Jiiva : వైఎస్ జగన్ పాత్రలో నటించడం చాలా రిస్క్.. కానీ

ఎన్టీఆర్ స్పూర్తితోనే పేదరిక నిర్మూలన ప్రాజెక్టును ఆయన స్వగ్రామం నిమ్మకూరులో ప్రారంభిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. మన గ్రామాలను ప్రపంచానికి అనుసంధానం చేసే వినూత్న కార్యక్రమమే ఈ పూర్ టు రిచ్.. నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుంది అని ఆయన చెప్పారు. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊర్లో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతాం.. ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో మన ఊర్లో పుట్టిన వారు మనతో సమానంగా పైకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రాజెక్టు పని చేస్తుంది.. ఇది ప్రారంభం మాత్రమే ఆచరణలో విజయవంతం కావటానికి కాస్త సమయం పడుతుంది అని చంద్రబాబు వెల్లడించారు.