Site icon NTV Telugu

Ra Kadalira: నేడు ఉరవకొండ చంద్రబాబు.. ‘రా.. కదలిరా’ పేరుతో పర్యటన..

Babu

Babu

నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. 11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు. పీలేరులో 11:50 నుంచి మధ్యాహ్నం 1:30 వరకూ చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభలో పాల్గొంటారు. ఆ వెంటనే రోడ్డు మార్గం ద్వారా పీలేరు మండలంలోని వేపులబైలు గ్రామానికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకోని.. అక్కడ సాయంత్రం 5:30 వరకూ చంద్రబాబు సభ నిర్వహిస్తారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5:30 వరకూ టీడీపీ నిర్వహించే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.

Read Also: Budget 2024 : బడ్జెట్లో మధ్యతరగతి ప్రజల ఈ 4అంచనాలు నెరవేరుతాయా ?

‘రా.. కదలిరా’ పేరుతో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సభను టీడీపీ ఏర్పాటు చేస్తుంది. తొలి సభ ఈ నెల 5న ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని కనిగిరిలో జరిగింది. ఇక, సంక్రాంతి వల్ల ఈ నెల 11 నుంచి 17 వరకు సభలకు విరామం ఇచ్చారు. అలాగే అయోధ్య రామాలయం వల్ల 21వ తేదీ నుంచి 23 వరకూ కూడా సభలకు గ్యాప్ ఇచ్చారు. ఇక, ఆ తరువాత అంతా యథావిధిగా కొనసాగుతుంది. అయితే, ఈ సభకు సంబంధించి టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేసింది. చంద్రబాబు ఉరవకొండకు చేరుకోగానే ఆయనకు పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిస్తే తాము ఏమి చేస్తామనే అంశాలను చంద్రబాబు ప్రజలకు చెప్పబోతున్నారు.

Exit mobile version