Chandrababu: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రజాగళం పేరుతో.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. రోజుకు రెండు, మూడు సభలు జరిగేలా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.. ఇక, ప్రజాగళంలో భాగంగా ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. బనగానపల్లె, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.. వింజమూరులో రాత్రికి బస చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు..
Read Also: Uttarpradesh : గ్యాంగ్ రేప్ చేశారంటే పట్టించుకోని పోలీసులు.. స్టేషన్లోనే విషం తాగిన బాధితురాలు
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నేడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. బనగానపల్లె పెట్రోల్ బంకు కూడలి వద్ద ప్రజాగళం భారీ బహిరంగ సభలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రసంగించనున్నారు. బాబు పర్యటనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. హెలి ప్యాడ్ గ్రౌండ్ ప్రాంగణాన్ని మరియు సమావేశం నిర్వహించనున్న ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి 10:55 గంటలకు హెలిక్యాప్టర్ లో చంద్రబాబు బయల్దేరి బనగానపల్లె పట్టణ శివారులోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన హేలీ ప్యాడ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు. హెలిప్యాడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక వాహనంలో పెట్రోల్ బంకు కూడలి బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు చైతన్య రథంపై జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 12:40 గంటల కు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నివాసంలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం వైసీపీని వీడి టీడీపీలో చేరే నాయకులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తారు.. 1:45 గంటలకు హెలిపాడ్ వద్దకు చంద్రబాబు చేరుకొని మధ్యాహ్నం 1:50 గంటలకు నెల్లూరు జిల్లా కావాలికి బయల్దేరి వెళ్తారు.. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి ప్రజా గళం సభను విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పిలుపు నిచ్చారు.