NTV Telugu Site icon

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Chandrababu

Chandrababu

Chandrababu: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు ప్రభుత్వ అధికారులు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రాజధాని గ్రామాలు, ఎయిమ్స్‌ సమీపంలోని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిసర ప్రాంతాలను కూడా చూస్తున్నారు. ఇక ప్రమాణ స్వీకారానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే పనిలో అధికారులు, టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఈ నెల 12న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీంతో రేపటి లోగా ప్రమాణ స్వీకార ప్రాంగణాన్ని ఖరారు చేయబోతున్నారు. ఏర్పాట్లకు కావాల్సిన సామాగ్రిని కూడా సిద్ధం చేశారు అధికారులు.

Read Also: Delhi: రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈనెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినా అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం.. ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు సమాచారం. దానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.

Show comments