NTV Telugu Site icon

Chandrababu: పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు..

Chandrababu Naidu

Chandrababu Naidu

Chandrababu: భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం కల్పించిన అవకాశం ఓటు హక్కు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు అని పేర్కొన్నారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది.. మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు అని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారని.. ఓటు దొంగలు ఓటు తీసేస్తారని .. లేదా మార్చేస్తారు.. నకిలీ ఓట్లు చేర్చేస్తారని ధ్వజమెత్తారు.

Read Also: Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అవుట్.. మళ్లీ బీజేపీతో జట్టు..?

ఎప్పటికప్పుడు ఓటు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని తెలిపారు. ఓటు లేని వారు వెంటనే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది అని ఈ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన ఓటర్లందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Read Also: Gyanvapi Mosque case: “విజయం అంచున ఉన్నాం”.. జ్ఞానవాపి నివేదికపై హిందూ తరపు న్యాయవాది