NTV Telugu Site icon

Chandrababu: అమర్నాథ్ భక్తుల ఆచూకీపై కేంద్రానికి చంద్రబాబు లేఖ

Chandrababu

Chandrababu

అమర్నాథ్‌ యాత్రలో అపశృతి కలిగిన సంగతి తెలిసిందే. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సాగుతున్న అమర్నాథ్ యాత్రను తిరిగి ప్రారంభించారు. 4020 మంది భక్తులతో అమర్నాథ్ యాత్ర రెండవ బ్యాచ్ మొదలైందని అధికారులు ప్రకటించారు. అమర్నాథ్ పుణ్యక్షేత్రంలో వరదల్లో చిక్కుకుపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కనిపెట్టి వారి యోగ క్షేమాలు చూడాలని కోరుతూ కేంద్రానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఈమేరకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు చంద్రబాబు. అమరేంద్రుడు తెలుగు ప్రజల్లో చాలా ప్రసిద్ధి. ఏపీ నుంచి ప్రతేడాది పెద్ద సంఖ్యలో భక్తులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని అమరేంద్రుడి దర్శనం చేసుకుంటున్నారు.

ఈ ఏడాది సైతం అనేక మంది భక్తులు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో భక్తులు మరణించడం చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో తప్పిపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ కోసం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆచూకీ తెలియక వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తప్పిపోయిన భక్తుల ఆచూకీ తక్షణమే కనుగొని వారికి వైద్య సహాయం, ఆహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తులు వారి స్వస్థలాలు చేరుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు కూడా చేయండి. తప్పిపోయిన 37 మంది తెలుగు భక్తుల గురించి మీరు తెలియజేసే సమాచారం బాధితులకు కుటుంబ సభ్యులకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుందని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

Amarnath Yatra 2022: అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం