NTV Telugu Site icon

Kiran Kumar Reddy: రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం

Kiran Kumar Reddy

Kiran Kumar Reddy

మాజీ ముఖ్యమంత్రి, త్వరలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో దోపిడీ, ఇసుక మాఫియ, దేవుని భూములు కబ్జాలు జరిగాయన్నారు. ఆరోపించారు. ఈ రోజు తంబల్లపల్లి లో గర్భిణీ పై దాడి పైశాచికమన్నారు. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం పట్టించిన ఘనత వైసీపీదే అన్నారు. ఇక్కడ పోలీసుల ఓవెరక్షన్ ఎక్కువ ఉందన్నారు. తగ్గించుకుంటే మంచిదని.. ఈ జగన్ మీకేమైనా మంచి చేశాడా అని అడిగారు. రాబోయే ఎలక్షన్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 2036 పోలింగ్ భూత్ లలో వెబ్ కెమెరా తో నిఘా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అందరూ ధైర్యంగా ఓటేసి విధంగా సెంట్రల్ బలగాలు మీకు తోడుంటాయని తెలిపారు.

READ MORE: Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఇటీవల బీజేపీలో చేరారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజంపేట ఎంపీ స్థానాన్ని కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.