భారతదేశంలో ఆంధ్రరాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో.. సృష్టించిన సంపద ప్రతి పేదవాడికి చేరవేయాలన్న సంకల్పంకూడా అంతే ముఖ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక పై ఎన్డీయే కూటమి పేదరికం లేని దేశం తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని తీసుకురావాలన్న స్పూర్తితో పని చేస్తుంది అన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని ఇక్కడ పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. ఇకపై తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇకపై 4.0 పాలన ఎలా ఉండబోతుందో మీరే చూస్తారు అంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.