Site icon NTV Telugu

Chandrababu: నాది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ నాకు పునర్జన్మ ఇచ్చాడు

Chandrababu

Chandrababu

తిరుపతిలో పవన్ కల్యాణ్, చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. మంగళం లీలామహల్ సెంటర్ మీదుగా గాంధీరోడ్డు వరకు రోడ్ షో చేపట్టారు. అనంతరం.. గాంధీరోడ్డు వద్ద వారాహీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి పవిత్రతను కాపాడటానికి ప్రజలందరు సిద్ధంగా ఉండాలని కోరారు. తనది పునర్జన్మ.. వేంకటేశ్వర స్వామీ తనకు పునర్జన్మ ఇచ్చాడని అన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి వారు పోటీ చేసిన గొప్ప చరిత్ర ఉన్న నియోజకవర్గం తిరుపతి అని తెలిపారు. పవన్ కళ్యాణ్ తిరుపతి సీటు అడిగినా వెంటనే ఇచ్చానని చెప్పారు.

PM Modi: ప్రధాని మోడీని కలిసిన పీవీ.నరసింహారావు కుటుంబం

మరోవైపు.. టీటీడీలో ఛైర్మన్లుగా అప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి.. ఈవో ధర్మారెడ్డి.. టీటీడీ మొత్తం వారి చేతుల్లో ఉందని ఆరోపించారు. సామాజిక న్యాయం వైసీపీలో ఎక్కడ ఉందని చంద్రబాబు ప్రశ్నించారు. నగరంలో గరుడావారధి ప్లై ఓవర్ ప్రారంభించింది, రోడ్లు వేసింది టీడీపీ అన్నారు. రేణిగుంటలో కష్టపడి తెచ్చిన కంపెనీలను తరిమేశాడని తెలిపారు. వైసీపీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని పేర్కొన్నారు. తిరుమల పవిత్రత దెబ్బతిసే వైసీపీని తరిమేయాలన్నారు.

Pawan Kalyan: వెంకటేశ్వర స్వామి కంటే అతను గొప్పవాడని అనుకుంటున్నారు..

కూటమి అధికారంలోకి రాగానే దేవాలయాలు కూల్చివేసిన వారిని అరెస్టు చేస్తాం.. కేసులు పెడుతామని చంద్రబాబు తెలిపారు. వేంకటేశ్వర స్వామీ సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఏపీలో ట్రస్ట్ బోర్డుల్లో సభ్యులుగా అవకాశం ఇస్తామన్నారు. యాభై ఏళ్ళకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెన్షన్ ఇస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ నుండి నాలుగు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తామని తెలిపారు. కూటమి మ్యానిఫెస్టో కలకలలాడుతోంది.. జగన్ మ్యానిఫెస్టో ఎత్తిపోయిందని ఆరోపించారు.

Exit mobile version