ఏపీలో సీబీసీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. సుప్రీం నిబంధనలను కూడా పట్టించుకోకుండా సీబీసీఐడీ వ్యవహరిస్తోంది. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణం రాజు విషయంలో ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే అప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోవాలి. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు.
కొంత మంది టెయినెటెడ్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వెంకటేష్, సాంబశివరావు వంటి వారి విషయంలో వ్యవహరించిన తీరు అమానుషం. తప్పుడు అధికారులను వదిలి పెట్టను. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ.. గుర్తుంచుకోండి. చంద్రబాబు ప్రెస్ కాన్ఫరెన్సులో తన బాధను వివరించారు బాధితుడు సాంబశివరావు. నా ఇంటికి సీఐడీ పోలీసులు వచ్చి దుర్భాషలాడుతూ అరెస్ట్ చేశారు. బెడ్ రూములోకి వచ్చి అరెస్ట్ చేశారు. స్టేషనుకు తీసుకెళ్లి బట్టలిప్పించారు.
Nara Lokesh: డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లను ప్రభుత్వం కొట్టేస్తోంది
నన్ను చిత్రహింసలకు గురి చేశారు. కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం గుండెల మీద తన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని బెదిరించారు. 41ఏ నోటీసులు ఇచ్చారు.. బయటకు పంపుతూ విచారణ జరుగుతోందని చెప్పమన్నారు. పెద్దొళ్లతో పెట్టుకుంటున్నావ్.. కొట్టినట్టు చెబితే మళ్లీ కేసులు పెడతామని హెచ్చరించారని బాధితుడు తన బాధ వెళ్ళబోసుకున్నాడు.అర్ధరాత్రి పూట, గోడ దూకి ఇంట్లోకి వెళ్లి నోటీసులివ్వాలా..?బెడ్రూములో బిడ్డకు పాలిస్తున్న తల్లిని కూడా పట్టించుకోకుండా అరెస్ట్ చేస్తారా..?
పోలీసులకు మానవత్వమే లేదా..?కొందరు సీఐడీ పోలీసులు ఎందుకు సైకోల మాదిరిగా వ్యవహరిస్తున్నారు..?జగదీష్ అనే సీఐ గోడలు దూకారు.ఆ సీఐకు గోడలు దూకడం అలవాటు.సుప్రీం నిబంధనలకు విరుద్దంగా వెంకటేష్, సాంబశివరావులను అరెస్ట్ చేశారు.డీజీపీ, సీఐడీ దీనికి ఏం సమాధానం చెబుతారు..?మా ఆఫీసులో పని చేసిన వారిని బెదిరిస్తే.. అరెస్ట్ చేస్తే.. ఎవ్వరూ పని చేయరనా..? ప్రభుత్వ ఉద్దేశ్యం.మా ఆఫీస్ మీద దాడి చేస్తే ఇప్పటి వరకు చర్యలు లేవు. తప్పుడు పనులు చేస్తున్న పోలీస్ అధికారులకు ఖాకీ యూనిఫాం వేసుకోవడానికి అర్హత లేదన్నారు చంద్రబాబు.
