Site icon NTV Telugu

Chandrababu Family: ఒకేసారి కుటుంబంలోని నలుగురు ఎమ్మెల్యేలుగా..

Tdp

Tdp

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైస్సార్సీపీ. బండ్లు ఓడలు అయినట్లుగా.. ఫలితంగా కూటమికి అత్యధిక ఓట్లు వచ్చాయి. అధికార పార్టీని ఓడించి అఖండ విజయం సాధించింది టీడీపీ కూటమి. మరోవైపు లోక్‌సభలోనూ అదే వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీలకు అత్యధికంగా సీట్స్ వచ్చాయి. ఇకపోతే నారా, నందమూరి కుటుంబం nudi నాలుగు టోర్నీల్లో విజయం సాధించింది.

Kinjarapu Atchannaidu: అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు వాడాలి.. అచ్చెన్నాయుడు కామెంట్స్..

కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్ గెలిచారు. నందమూరి కుటుంబంలో బాలకృష్ణ హిందూపురం నుంచి, భరత్ విశాఖపట్నం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ సర్వేలో చంద్రబాబు 1,18,623 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్‌కు 1,20,101 ఓట్లు రాగా, హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణకు 1,07,250 ఓట్ల మెజారిటీలు వచ్చాయి. ఇక విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన భరత్ కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.

PM Modi: మూడోసారి ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారు..

కూటమి విజయంతో తెలుగు తమ్ముళ్లు ప్రతిచోటా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో అధికార వైసీపీ 11 సీట్లు మాత్రమే గెలుచుకోగా, కూటమి 164 సీట్లు గెలుచుకుంది.

Exit mobile version