రాయలసీమలో మూడు సీట్లు వచ్చినందుకు ఎగతాళి చేశారని.. పులివెందులలో కూడా ఇపుడు వైసీపీ కి జగన్ కు ఎదురుగాలి వేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో భూహక్కు పత్రాన్ని తగల బెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో 52 కి 52 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని ప్రాజెక్టులు నిలిపేశారన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. జగన్ తల్లి కనిపిస్తుందా…తల్లి ని చూసుకుంటున్నాడా అని అడిగారు. చెల్లెలికి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడా అని ప్రశ్నించారు. జగన్ నార్సీ విధానంలో ఉన్నారని దుయ్యబట్టారు.
READ MORE: Namburu Sankara Rao: వైసీపీలోకి భారీగా చేరికలు.. పార్టీలోకి ఆహ్వానించిన నంబూరు..
ఒక ఎంపీ తిరగబడటం చరిత్రలో చూశారా అన్నారు. ఒక ఎంపీ ని సీఐడీ విచారణ పేరుతో కొట్టించారని ఆరోపించారు. గులకరాయి డ్రామా ఆడుతున్నారన్నారు. జగన్ దేవుడు కంటే గొప్పోడు అనుకుంటున్నాడని… పాలించమని ఐదేళ్లు అధికారం ఇస్తే సెక్రటేరియట్ కి వచ్చాడా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో మూడు ముక్కలు ఆట ఆడారని చంద్రబాబు విమర్శించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. జె బ్రాండ్ మద్యం అమ్ముతున్నారన్నారు. మనల్ని స్మశాననికి పంపే బ్రాండ్ అదని తెలిపారు. ప్రతిపక్షాలు మాట్లాడకుండా జీఓ 1 తీసుకొచ్చారన్నారు. సీఎం అయిన వెంటనే ప్రజావేదిక కూల్చారని ఆరోపించారు. రాయలసీమలో 190 ప్రాజెక్టులు ఆపివేశారన్నారు.