NTV Telugu Site icon

Chandrababu: మందుబాబులకు చంద్రబాబు బంపర్ ఆఫర్..

Babu

Babu

మందుబాబులకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలుతో తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు.

Tragedy: పండగ పూట తీవ్ర విషాదం.. స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా?అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రావడానికే భయపడ్డారని.. చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao: ఏ రైతును చూసినా.. ఆవేదన.. కన్నీళ్లే కనిపిస్తున్నాయి

రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు మాటిస్తున్నా.. ఇప్పుడున్న ఆదాయాన్ని మూడింతలు చేసే బాధ్యత తనదని చంద్రబాబు పేర్కొన్నారు. జలగ చేసే పని… రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం! తాను అలా కాదు… సంపద సృష్టిస్తాను, ఆదాయాన్ని పెంచుతాను… ఆ డబ్బును మీకే పంచుతానని తెలిపారు. ఆ డబ్బుతో రూ.15తో రూ.100 సంపాదించే మార్గం తాను నేర్పిస్తాను… రూ.100 నుంచి రూ.1000… రూ.1000 నుంచి రూ. పది వేలు సంపాదించే మార్గం తాను చూపిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.