NTV Telugu Site icon

Chandrababu Naidu: వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడే సీఎం చంద్రబాబు ప్రకటన..

Cm

Cm

Chandrababu Naidu: ఏపీలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియ పై సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేసారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేయాలని ఇదివరకే అధికారులతో సీఎం సమావేశంలో తెలిపారు. ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, అలాగే పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి అధికారులు తెలియచేసారు. నష్టం అంచనాలు పూర్తి చేసి 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దాం అని ముఖ్యమంత్రి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Gas Cylinder Blast: భారీ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన 8 మందికి కిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం..

సిఎం చంద్రబాబు నాయుడు నేడు (మంగళవారం) 12 గంటలకు సచివాలయానికి చేరుకొని., మొదటగా నూతన ఎక్సైజ్ పాలసీపై రివ్యూ చేస్తారు. ఆ తర్వాత బిసి వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై రివ్యూ చేస్తారు. ఆపై భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ప్రకటన చేయనున్నారు.