Site icon NTV Telugu

New Year Wishes: తెలుగు ప్రజలకు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Chandrababu And Pawan Kalyan

Chandrababu And Pawan Kalyan

New Year Wishes: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చంద్రబాబు అన్నారు. నూతన సంవత్సరంలో హింసకు, అవినీతికి, అశాంతికి, అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలన్నారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడిని 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదామని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Tirumala: 2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

నూతన సంవత్సర శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కొత్త ఆకాంక్షలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పారు. గతం అందించిన అనుభవాలతో కొత్త యేడాదిలో ముందుకు సాగాలన్నారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొనే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలు మలుపు కావాలన్నారు. ప్రజా నిర్ణయం కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలపై ప్రభావం చూపిస్తుందన్నారు. 2024 సంవత్సరం అందరిలో కొత్త ఉత్సాహాన్నీ, సుఖ సంతోషాలను అందించాలని పవన్‌ కోరుకున్నారు.

Exit mobile version