NTV Telugu Site icon

Chandini Chowdary: మా ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేదు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Chandini Chowdary

Chandini Chowdary

టాలీవుడ్ హీరోయిన్ తెలుగు అమ్మాయి ‘చాందిని చౌదరి’ ఇటీవల కాలం వరుస సినిమాలతో, అలాగే వెబ్ సిరీస్ లతో మంచి విజయాలను సొంతం చేసుకుంటుంది. హీరో విశ్వక్ సేన్ తో కలిసి నటించిన ‘గామి’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో కూడా వేసుకుంది. ఇకపోతే ఈ హీరోయిన్ మొదటి నుంచి కాస్త వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త కొత్త పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ నేపధ్యంలోనే అతి త్వరలో చాందిని చౌదరి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అజయ్ గోష్ సరసన నటిస్తూ కొత్త కథతో థియేటర్లోకి రాబోతోంది.

Also Read: Avesham: 100 కోట్ల దిశగా దూసుకెళ్తున్న మలయాళ సినిమా..

తాజాగా జరిగిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా హీరోయిన్ పాల్గొనింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ లో మీడియా వారు ఆవిడను కొన్ని ప్రశ్నలను అడగగా.. ఆవిడ కాస్త కూల్ గా సమాధానం ఇచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా ఓ మీడియా ప్రతినిధి హీరోయిన్ ను ‘ మీ ఫేవరెట్ ఐపిఎల్ టీం ఏంటి’ అని అడగగా.. దానికి హీరోయిన్ సమాధానం ఇస్తూ., తన జీవితంలో ఒక్కసారి అయినా ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తను ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడలేదని., కాకపోతే కేవలం సీసీఎల్ మ్యాచులు మాత్రం చూశాను అంటూ చెప్పుకొచ్చింది. అలా ఏదైనా ఒక్క మ్యాచ్ అయిన ఐపీఎల్ మ్యాచ్ చూసి తర్వాత తాను ఆ టీమ్స్ నుంచి ఏ ఫేవరెట్ అని సెలెక్ట్ చేసుకుంటాను అని చెబుతూ.. ఎందుకంటే మాది ఆంధ్ర కాబట్టి మా ఆంధ్రకు టీం లేదని తెలిపింది.

Also Read: Iswarya Menon: శారీలో అందాలు ఆరబోస్తున్న ఐశ్వర్య మీనన్….

అయితే అందుకు మరోసారి మీడియా ప్రతినిధుల నుండి తెలుగు రాష్ట్రాల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉంది కదా అని అడగగా.. ‘మాది ఆంధ్ర. మాకు ఆంధ్ర టీం లేదు’ అంటూ మరోసారి హీరోయిన్ చాందిని తెలిపింది. దీంతో ప్రస్తుతం హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి హీరోయిన్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా..?

 

Music Shop Murthy Telugu Teaser I Ajay Ghosh, Chandini Chowdary I Fly High Cinemas