హైపర్ ఆది గురించి అందరికి తెలుసు… బుల్లితెర పై పలు షోలల్లో కనిపిస్తూ తన కామెడితో నవ్విస్తూ ఉంటాడు.. ఇక సినిమాల్లో కూడా నటిస్తుంటాడు.. ఆది కామెడీ టైమింగ్ అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.. ఇక టీవీ షోలకు వచ్చే హీరోయిన్లతో ఈయన కలిపే పులిహోర గురించి తెలిసిందే.. అదే ఆ ఎపిసోడ్ కు హైలెట్ అవుతుంది.. తాజాగా ఓ హీరోయిన్ ఆదికి ప్రపోజ్ చేస్తూ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన గామి మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో నటించిన చాందిని చౌదరి మనందరికీ సుపరిచితమే. కలర్ ఫోటోతో మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ బుల్లితెర షో కి హాజరైంది. తన డ్యాన్స్ తో అలరించింది.. ఇక అదే బుల్లితెర షోలో ఆది సైతం పాల్గొన్నారు. ఇక ఆది ఒక అమ్మాయిని తీసుకువచ్చి తినే నాకు కాబోయే భార్య అని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోతారు..
ఇక ఆ తర్వాత ఆది మాట్లాడుతూ.. శ్రీముఖి, నేను జంట బాగుందని అనుకున్నావా అంటూ అడగ్గా.. చాందిని కన్నీళ్లు పెట్టుకుంది.. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. నిజానికి చాందిని చౌదరి ఆ పని సరదాగా చేసినట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఆది ఉండే ఏదైనా ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారింది.. చాందిని నటించిన గామి సినిమా సక్సెస్ అయ్యింది..