NTV Telugu Site icon

Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం సీరియస్.. కోర్టుకు హాజరుకావాలని అధికారికి ఆదేశం

Chdi

Chdi

చండీగఢ్ రిటర్నింగ్ అధికారిపై (Chandigarh Poll Officer) సుప్రీంకోర్టు సీరియస్ (Supreme Court) అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమ్‌ఆద్మీ పార్టీ వేసిన పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో మంగళవారం విచారణకు హాజరుకావాలని రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ను ఆదేశించింది. అంతేకాకుండా బ్యాలెట్ పత్రాలు కూడా సమర్పించాలని సూచించింది.

చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారు. వాస్తవానికి కాంగ్రెస్-ఆప్ సభ్యులకు సంపూర్ణ మద్దతు ఉంది. ఈ మేయర్ పోస్టును ఆప్-కాంగ్రెస్ కూటమి ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ఆప్ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మేయర్ ఎన్నిక సందర్భంగా అధికారి చేసిన అక్రమాల వీడియోను కూడా కోర్టుకు సమర్పించారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం రిటర్నింగ్ అధికారిపై మండిపడింది.

ఇదిలా ఉంటే సోమవారం కోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ముందుగానే చండీగఢ్ మేయర్ మనోజ్ సోంకర్ తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ముగ్గురు ఆప్ అభ్యర్థులు బీజేపీలో చేరారు.

మంగళవారం చండీగఢ్ రిటర్నింగ్ అధికారి సుప్రీంకోర్టులో హాజరై.. ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలను కోర్టుకు సమర్పించాల్సి ఉంది. మరీ అధికారి హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.