NTV Telugu Site icon

Dhavaleswaram Project: ధవళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద వరద ఉధృతి తగ్గుముఖం పట్టే ఛాన్స్

Davaleshwaram

Davaleshwaram

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం సృష్టించడంతో వరద నీరు ఇళ్ల మధ్యకు చేరి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇక, గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం దగ్గర ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇవాళ (శనివారం) రాత్రి 9 గంటలకు భద్రాచలం దగ్గర మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది అని తెలిపాడు. నీటిమట్టం 55.9అడుగులు ఉండగా.. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.8లక్షల క్యూసెక్కులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. సహాయక చర్యల్లో 4ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.

Read Also: Bholaa Shankar: ‘భోళా శంకర్‌’లో ప్రధాన ఆకర్షణగా అన్నా చెల్లెళ్ళ బాండింగ్

కృష్ణా వరద ప్రవాహం శనివారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి దగ్గర ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులుగా ఉందని తెలిపారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని డా. బీఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వరదల పట్ల అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలి అని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ డా.బీఆర్ అంబేద్కర్ సూచించారు.

Read Also: Explosion: బాణాసంచా గోదాంలో పేలుడు.. 9 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు