Site icon NTV Telugu

TDP-Janasena First List: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్.. 14 మంది మహిళలకు టికెట్లు

Tdp Js

Tdp Js

TDP-Janasena First List: టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా ప్రకటించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌ ఈ తొలి జాబితాను విడుదల చేశారు. 24 ఎమ్మెల్యే స్థానాల్లో, మూడు ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.. మిగతా స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని చంద్రబాబు వెల్లడించారు. ఇక, తొలి జాబితాలో భాగంగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే టీడీపీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వెల్లడించారు.. ఇక, జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. టీడీపీ – జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలు పరిశీలిస్తే బీసీ అభ్యర్థులు 19, ఎస్సీ అభ్యర్థులు 20, ఎస్టీ అభ్యర్థులు 03, కాపు అభ్యర్థులు 10, కమ్మ అభ్యర్థులు 22, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు 17, వైశ్య 2, క్షత్రియ 4, వెలమ 1, మైనార్టీల నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు..

Read Also: CM Revanth : ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

మరోవైపు.. టీడీపీ-జనసేన కూటమి తొలిజాబితాలో 14మంది మహిళలకు అవకాశం వచ్చింది.. పెనుకొండ- సవిత, రాప్తాడు- పరిటాల సునీత, సింగనమల- బండారు శ్రావణి, పాణ్యం- గౌరు చరితారెడ్డి, ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ, కడప- మాధవిరెడ్డి, సూళ్లూరుపేట- విజయశ్రీ, నందిగామ- తంగిరాల సౌమ్య, తుని- యనమల దివ్య, పాయకరావుపేట- వంగలపూడి అనిత, సాలూరు – గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం-అదితి గజపతిరాజు, అరకు-జగదీశ్వరీ, నెల్లిమర్ల-లోకం మాధవి(జనసేన)లకు టికెట్లు కేటాయించాయి రెండు పార్టీలు.. మొత్తంగా తొలి జాబితాలో 14 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కగా.. మిగతా స్థానాల్లో మరికొందరు మహిళలను బరిలోకి దించే అవకాశం ఉంది.

Exit mobile version