NTV Telugu Site icon

Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. రెండ్రోజుల పాటు కురిసే ఛాన్స్

Telangana Rainsa

Telangana Rainsa

Telangana Rains: తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ కేంద్రంగా అధికారులు ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. నేడు హైదరాబాద్ సహా మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నారాయణపేట, వికారాబాద్ వనపర్తి జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఇందుకోసం సంబంధిత జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములతో పాటు గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం (నవంబర్ 8) హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీర్ పేట, కూకట్ పల్లి, ఖైరతాబాద్, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసుఫ్ గూడ, మియాపూర్, చింతల్, షాహాపూర్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, బోయినపల్లి, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్బుల్లాపూర్, ., కొంపల్లి, దూలపల్లి, మల్లంపేట, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, గండిమైసమ్మ, బహుదూర్ పల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల వర్షం లేదా మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉందన్నారు.
CM YS Jagan: నేడు, రేపు సీఎం జగన్ అన్నమయ్య, కడప జిల్లాల్లో పర్యటన