NTV Telugu Site icon

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..?

Champions Trophy 2025

Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. కాగా.. మ్యాచ్‌ల నిర్వహణ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించానున్నారు. మరోవైపు.. టీమిండియా మ్యాచ్‌లు విదేశాల్లోనే జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరుగుతాయి.

Read Also: AP New CS: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్ ఎవరు?.. సీఎం చంద్రబాబు ఆలోచన ఏంటి?

ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.. గ్రూప్‌-ఏలో భారత్‌, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. కాగా.. మార్చి 4న సెమీఫైనల్-1, 5వ తేదీన సెమీ ఫైనల్ -2, మార్చి 9న ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. సెమీ-ఫైనల్ మరియు ఫైనల్ రెండింటికీ రిజర్వ్ రోజులు ఉంటాయి.

Bengaluru: ‘‘నార్త్-ఇండియన్స్ వల్లే బెంగళూర్’’.. వివాదం అవుతున్న మహిళ కామెంట్స్..