NTV Telugu Site icon

IND vs AUS Semi Final Live Updates: భారత్‌ vs ఆస్ట్రేలియా సెమీ ఫైనల్.. లైవ్ అప్‌డేట్స్!

Ind Vs Aus Semi Final Live Updates

Ind Vs Aus Semi Final Live Updates

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్ ఆరంభమైంది. మూడు లీగ్‌ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే నాకౌట్‌ మ్యాచ్‌ అంటేనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.

  • 04 Mar 2025 07:51 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న కోహ్లీ, శ్రేయస్

    20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగుల చేసిన టీమిండియా. క్రీజులో విరాట్ కోహ్లీ (34), శ్రేయస్ అయ్యార్ (31).

  • 04 Mar 2025 07:35 PM (IST)

    విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్..

    విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డ్.. ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇండియన్ ప్లేయర్ గా విరాట్.. ఇప్పటి వరకు 8003 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ.. మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్, రెండో స్థానంలో విరాట్, మూడో స్థానంలో రోహిత్ శర్మ, నాలుగో స్థానంలో సనత్ జయసూర్య..

  • 04 Mar 2025 07:12 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా..

    10 ఓవర్లలో 50 పరుగుల మార్క్ దాటిన టీమిండియా.. క్రీజులో విరాట్ కోహ్లీ (9) శ్రేయస్ అయ్యార్ (8).. ప్రస్తుతం భారత్ స్కోర్ 56/2..

  • 04 Mar 2025 07:04 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 43 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్.. కూపర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన రోహిత్..

  • 04 Mar 2025 06:51 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా..

    తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. 30 పరుగుల వద్ద బెన్ డ్వార్షిస్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన శుభ్‌మాన్‌ గిల్ (8)

  • 04 Mar 2025 06:48 PM (IST)

    నెమ్మదిగా టీమిండియా బ్యాటింగ్..

    4. 3 ఓవర్లలో కేవలం 25 పరుగులు చేసిన టీమిండియా.. క్రీజులో రోహిత్ శర్మ (16), గిల్ (8)

  • 04 Mar 2025 06:36 PM (IST)

    ప్రారంభమైన రెండో ఇన్సింగ్స్..

    ప్రారంభమైన రెండో ఇన్సింగ్స్.. 8 బంతుల్లో 14 పరుగులు కొట్టిన రోహిత్ శర్మ..

  • 04 Mar 2025 06:00 PM (IST)

    ఆస్ట్రేలియా ఆల్ అవుట్..

    ఆస్ట్రేలియా ఆల్ అవుట్.. 264 పరుగులకే కుప్పకూలిన ఆసీస్.. టీమిండియా టార్గెట్ 265 పరుగులు..

  • 04 Mar 2025 05:57 PM (IST)

    9వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    9వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 262 పరుగుల వద్ద ఎల్లిస్ (10) ఔట్.. షమీ బౌలింగ్ లో విరాట్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టిన నాథన్ ఎల్లిస్..

  • 04 Mar 2025 05:49 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్..

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. అలెక్స్ కారీ రన్ అవుట్.. 57 బంతుల్లో 61 పరుగులు చేసిన కారీ.. క్రీజులోకి వచ్చిన నాథన్‌ ఎల్లిస్‌..
    ఆస్ట్రేలియా స్కోర్ 250/8

  • 04 Mar 2025 05:39 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్

    ఏడో వికెట్ కోల్పోయిన ఆస్త్రేలియా.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన బెన్ ద్వార్షుయిస్ (19).. ఆస్ట్రేలియా స్కోర్ 241/7

  • 04 Mar 2025 05:29 PM (IST)

    అర్ధశతకం కొట్టిన అలెక్స్ కేరీ

    48 బంతుల్లో అలెక్స్ కేరీ హాఫ్‌ సెంచరీ.. వన్డేల్లో కేరీకి 12వ అర్ధశతకం ఇది.. 43.4 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌ 231/6

  • 04 Mar 2025 05:06 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    ఆరో వికెట్ కోల్పోయిన ఆస్త్రేలియా.. 4 బంతుల్లో 7 పరగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిన గ్లెన్ మ్యాక్స్ వెల్..

  • 04 Mar 2025 05:02 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన ఆస్త్రేలియా..

    ఐదో వికెట్ కోల్పోయిన ఆస్త్రేలియా.. 73 పరుగుల వద్ద ఔటైన స్మిత్.. ఆసీస్ స్కోర్ 198/5

  • 04 Mar 2025 04:43 PM (IST)

    150 పరుగుల మార్క్ దాటిన ఆస్ట్రేలియా..

    క్రమంగా వికెట్లు పడుతున్నా ఆసీస్ నిలకడగా రన్స్ రాబడుతోంది.. 29 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 150 మార్క్ అందుకుంది. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 173/4.. అలెక్స్ కేరీ (20), స్టీవ్ స్మిత్ (68) క్రీజులో ఉన్నారు.

  • 04 Mar 2025 04:23 PM (IST)

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్..

    నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 144 పరుగులు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన జోష్ ఇంగ్లిస్ (11)

  • 04 Mar 2025 04:20 PM (IST)

    హాఫ్ సెంచరీ చేసిన స్మిత్..

    టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్థ శతకంతో మెరిశాడు. 68 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 26.3 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 141/3

  • 04 Mar 2025 04:08 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్..

    మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్నస్ లబుషేన్ ను ఔట్ చేసిన రవీంద్ర జడేజా.. 29 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టిన లబుషేన్

  • 04 Mar 2025 04:06 PM (IST)

    36 రన్స్ వద్ద స్టీవ్‌స్మిత్‌కు లైఫ్‌..

    తన బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను మహ్మద్ షమీ అందుకోలేక పోయాడు.. మ్యాచ్‌ ప్రారంభంలో ట్రావిస్‌ హెడ్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను కూడా అతడి ఒడిసిపట్టలేకపోయాడు. 22 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌ 110/2

  • 04 Mar 2025 03:41 PM (IST)

    ఆచితూచి ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు..

    ఆచితూచి ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. నెమ్మదిగా పరుగులు రాబడుతున్న ఆసీస్.. క్రీజులో స్టీవ్‌ స్మిత్‌ (26), లబుషేన్‌ (9).. 15.4 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌ 80/2

  • 04 Mar 2025 03:21 PM (IST)

    భారత్ కు తలనొప్పిగా మారిన హెడ్ ఔట్..

    భారత్ కు తలనొప్పిగా మారిన హెడ్ ఔట్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ అవుట్.. భారీ షాట్ ఆడబోయి గిల్ కి క్యాచ్ ఇచ్చిన హెడ్.. 9 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌ 58/2

  • 04 Mar 2025 03:17 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్

    రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 33 బంతుల్లో 39 పరుగులు చేసిన ట్రావిస్‌ హెడ్‌.. 8.2 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌ 54/1

  • 04 Mar 2025 02:50 PM (IST)

    మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

    సెమీస్ లో తమ మొదటి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 4 పరుగుల వద్ద కూపర్ ఔట్.. షమీ బౌలింగ్‌లో కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చిన కూపర్‌..

  • 04 Mar 2025 02:32 PM (IST)

    ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రారంభం:

    సెమీస్‌ మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లుగా కూపర్, ట్రావిస్ హెడ్ క్రీజులోకి వచ్చారు. భారత్‌ బౌలింగ్‌ను షమీ మొదలెట్టాడు.

  • 04 Mar 2025 02:30 PM (IST)

    ఆసీస్‌ జట్టులో ఆరుగురు స్పిన్నర్లు:

    తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియా జట్టులో ఆరుగురు స్పిన్నర్లు ఉన్నారు. జంపా, తన్వీర్, కూపర్, మ్యాక్స్‌వెల్, హెడ్, లబుషేన్ స్పిన్ బౌలింగ్ వేయనున్నారు.

  • 04 Mar 2025 02:18 PM (IST)

    తుది జట్లు:

    భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి.
    ఆస్ట్రేలియా: కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.

  • 04 Mar 2025 02:15 PM (IST)

    14వ సారి టాస్‌ ఓడిన భారత్‌:

    భారత్‌ వరుసగా 14వ సారి టాస్‌ ఓడింది. కెప్టెన్‌గా ఇది రోహిత్‌ శర్మకు 11వ సారి కావడం గమనార్హం.

  • 04 Mar 2025 02:09 PM (IST)

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా:

    ఛాంపియన్స్ ట్రోఫీ 2025: సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తుది జట్టులో రెండు మార్పులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్మిత్.. మ్యాథ్యూ షార్ట్‌ స్థానంలో కూపర్‌, జాన్సన్‌కి బదులుగా సంఘా.. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయని భారత సారథి రోహిత్ శర్మ

  • 04 Mar 2025 02:03 PM (IST)

    మెక్‌గుర్క్‌ను తీసుకోండి:

    ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ షార్ట్‌ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగాడు. అతడికి బదులు కూపర్‌ రిప్లేస్‌ను సీఏ తీసుకుంది. అయితే కూపర్‌ బదులుగా జేక్ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు.

  • 04 Mar 2025 02:01 PM (IST)

    అందరి దృష్టి హెడ్ పైనే:

    సెమీస్‌లో అందరి దృష్టి ట్రావిస్ హెడ్ పైనే ఉంది. భారత్‌ అంటే చెలరేగిపోయే హెడ్‌ను కట్టడి చేస్తే.. సగం విజయం సాధించినట్లేనని అని మాజీలు, ఫాన్స్ అంటున్నారు.

  • 04 Mar 2025 02:00 PM (IST)

    షమీ కోలుకోకపోతే:

    రవీంద్ర జడేజాను తప్పించి వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. గాయపడిన మమ్మద్ షమీ కోలుకోకపోతే.. అర్ష్‌దీప్‌ సింగ్‌ లేదా హర్షిత్ రాణాకి చోటు దక్కుతుంది.

  • 04 Mar 2025 01:59 PM (IST)

    రాహుల్ స్థానంలో పంత్:

    మరికొద్దిసేపట్లో భారత్‌, ఆస్ట్రేలియా సెమీస్‌ మ్యాచ్ ఆరంభం కానుంది. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై పంత్‌కు మంచి రికార్డు ఉండడం, లీగ్ దశలో కీపర్‌గా రాహుల్ విఫలమవడం ఇందుకు కారణం అని సమాచారం.