NTV Telugu Site icon

IND vs NZ: నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌.. పిచ్ రిపోర్ట్ ఇదే

Pich Report

Pich Report

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది. దుబాయ్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. దుబాయ్‌లో భారత్ మ్యాచ్ లు ఆడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది. లీగ్ దశలో న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు.. కివీస్‌ను ఓడించి 12 సంవత్సరాల ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే.. ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్‌ని ఒకసారి చూద్దాం.

Chhaava: రెండో రోజు అధిరిపోయిన తెలుగు ‘ఛావా’ బుకింగ్స్

ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ పిచ్ రిపోర్ట్:
దుబాయ్‌లోని పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. గత రెండు మ్యాచ్‌ల్లో భారత్ ‘స్పిన్ క్వార్టెట్’ను ప్రయత్నించింది.. ఇది ప్రభావవంతంగా పని చేసింది. ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి రెండు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో కూడా స్పిన్ బౌలర్లకు పిచ్ నుంచి సహాయం లభించే అవకాశం ఉంది. అయితే ఫాస్ట్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేము. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ.. న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ దుబాయ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇదిలా ఉంటే.. దుబాయ్‌ స్టేడియంలో 270 కంటే ఎక్కువ స్కోరును ఛేజ్ చేయడం చాలా కష్టం. ఈ స్టేడియంలో రన్ ఛేజింగ్ మ్యాచ్‌లు ఎక్కువగా గెలిచారు. ఈ క్రమంలో ఫైనల్‌లో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ చేయడం మంచింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వన్డే రికార్డులు:
మొత్తం మ్యాచ్‌లు: 62
మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లు: 23
ఛేజింగ్‌లో గెలిచిన మ్యాచ్‌లు: 37
సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 220
అత్యధిక మొత్తం: 355/5 (50 ఓవర్లు) ఇంగ్లాండ్ vs పాకిస్తాన్, 2015
అత్యల్ప స్కోరు: 91/10 (31.1 ఓవర్లు) UAE vs నమీబియా, 2023
అత్యధిక విజయవంతమైన పరుగులు: 287/8 (49.4 ఓవర్లు) శ్రీలంక vs పాకిస్తాన్, 2013
డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరు: 168/10 (46.3 ఓవర్లు) UAE vs నేపాల్, 2022
అత్యధిక పరుగులు: రిచీ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్) – 424
అత్యధిక వ్యక్తిగత స్కోరు: ముష్ఫికర్ రహీం (బంగ్లాదేశ్) – 144
అత్యధిక సిక్సర్లు: రోహిత్ శర్మ (ఇండియా) – 16
అత్యధిక వికెట్లు: షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 25
ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్: షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 6/38

భారత్ vs న్యూజిలాండ్ వన్డే హెడ్-టు-హెడ్ రికార్డు
భారత్-న్యూజిలాండ్ జట్ల హెడ్-టు-హెడ్ రికార్డు గురించి మాట్లాడుకుంటే.. ఇరు జట్ల మధ్య మొత్తం 119 వన్డే మ్యాచ్‌లు ఆడారు. అందులో టీమిండియానే పైచేయి సాధించింది. భారత్ 61 వన్డేల్లో కివీస్‌ను ఓడించింది. న్యూజిలాండ్ 50 మ్యాచ్‌ల్లో గెలిచింది. 7 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు, ఒకటి టై అయింది. గత ఐదు వన్డేల్లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. 2021 జనవరి 21 నుండి 202 మార్చి 2 వరకు జరిగిన అన్ని వన్డేలలో భారత్ కివీస్ జట్టును ఓడించింది.

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్ , కెఎల్ రాహుల్ , హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ , రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, జాకబ్ డఫీ, డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్.