Site icon NTV Telugu

Champion: ఛాంపియన్ ఒరిజినల్ రాజిరెడ్డిని చూశారా!

Original Rajireddy

Original Rajireddy

Champion: తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘ఛాంపియన్’. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మాతలు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో హీరోగా రోషన్ మేకా నటించగా, మలయాళ భామ అనస్వర రాజన్ హీరోయిన్‌గా అలరించింది. ఈ సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత వెండి తెరపై కనిపించిన నటుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. నిజానికి ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి ఒక మంచి నటుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

READ ALSO: Syria: శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో భారీ పేలుడు.. 8 మంది మృతి..

ఇంతకీ ఈ సినిమాలో ఆయన ప్లే చేసిన రోల్ వాస్తవానికి ఎవరిదో తెలుసా.. ఇమ్మడి రాజిరెడ్డిది. తెలంగాణ పోరాటంలో భైరాన్‌పల్లికి ప్రత్యేక ప్రస్థానం ఉంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని ఒక ఊరు భైరాన్‌‌పల్లి. ఇది ఊరు మాత్రమే కాదండోయ్, ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన నిజాం రజాకార్లకు ముచ్చెమటలు పట్టించిన ప్రాంతం. నిజాం తోకల ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన అమరులను కన్న ఊరు. ఆ కాలంలో రజాకార్లకు ఎదురొడ్డి మానప్రాణాలను సైతం లెక్క చేయని వీరులను తెలంగాణ ప్రాంతానికి అందించిన పల్లెల్లో ఇది కూడా ఒకటి. భైరాన్‌పల్లిలో జరిగిన మారణకాండ అమృత్ సర్లో జరిగిన జలియన్ వాలాబాగ్ సంఘటనకు ఏమాత్రం తీసిపోదని చరిత్ర విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి భైరాన్‌పల్లి గ్రామంలో ఇమ్మడి రాజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఐక్యత సంఘంగా, రక్షణ దళాలుగా ఏర్పడి రజాకార్లను ఎదుర్కొన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి నటించి మెప్పించారు.

READ ALSO: రాజుగారి పెళ్లిరో.. Anaganaga Oka Raju లిరికల్‌ వీడియో రిలీజ్!

Exit mobile version