Champion: శ్రీకాంత్ వారసుడు రోషన్ మేక హీరోగా, అనస్వరా రాజన్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ పీరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది అని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
READ ALSO: The Raja Saab Trailer: ‘ది రాజాసాబ్’ సరికొత్త ట్రైలర్ చూశారా!
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘ఛాంపియన్’, వీకెండ్లో మరింత పుంజుకుంది. ముఖ్యంగా ఆదివారం నాడే దాదాపు 2.6 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం విశేషం. మిగతా క్రిస్మస్ సినిమాలతో పోలిస్తే, ఈ చిత్రం బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లోనూ, ఏ-సెంటర్లలోనూ అత్యధిక ఆక్యుపెన్సీని నమోదు చేస్తూ క్లీన్ విన్నర్‌గా నిలిచింది. స్వప్న సినిమాస్ తెలివైన ప్రీ-రిలీజ్ బిజినెస్ స్ట్రాటజీ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. సినిమా థియేటర్లలోకి రాకముందే నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారా పెట్టుబడి మొత్తం రికవరీ కావడంతో, ఇప్పుడు థియేటర్ల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నిర్మాతలకు లాభంగా మారుతోంది. ఇది నిర్మాతలకు అత్యంత లాభదాయకమైన వెంచర్ అనే చెప్పాలి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేకపోవడం, పైగా నూతన సంవత్సర సెలవులు దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
READ ALSO: Virat Kohli: అభిమానులకు శుభవార్త.. మరో మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!
