Site icon NTV Telugu

Chammak chandra : జబర్దస్త్ లోకి రాకముందు చమ్మక్ చంద్ర ఇలాంటి పనులు చేశాడా?

Chammak Chandra

Chammak Chandra

జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి అందరికి తెలుసు..జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ దగ్గరైన వారిలో చమ్మక్ చంద్ర ఒకడు,కుటుంబ కథలు తీస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే ప్రతిఒక్కరు ఇష్టపడుతారు. ఒకపక్క ఆడవారిని తక్కువ చేస్తూ మరో పక్క వారి విలువేంటో చెప్పి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నాడు. అందుకే జబర్దస్త్ షో లో చంద్ర స్క్రిట్ కి మంచి రేటింగ్ ఉంది.. ఇప్పుడు చంద్ర షో నుంచి వెళ్ళిపోయాడు.. అయితే చంద్ర జబర్దస్త్ కు రాక ముందు ఎలా ఉండేవాడు? ఏం పనిచేసేవాడు అనేది చాలా మందికి తెలియదు..

నిజానికి చంద్ర ఇండస్ట్రీకి రాకముందు హైదరాబాద్ లో కూలి పని చేసేవాడు…అతని కుటుంబం విషయానికొస్తే కడు పేదరికం నుంచి వచ్చాడు.. చంద్ర తల్లి మిషన్ కుట్టేది.. తండ్రి కట్టెలు అమ్మేవాడు..ఆ తర్వాత తన అన్నలు వ్యవసాయం ప్రారంభించారు.. అప్పుడు సినిమాల్లోకి రావాలని ఎన్నో కష్టాలు పడ్డాడు.. కూలి పని చేసి మిగిలినవి ఇంటికి పంపేవాడు.. ఇలా చాలా కష్ట పడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు..

 

ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న చంద్ర తన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డ్యాన్స్ బాగా వచ్చు కాబట్టి ఏదైనా పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ వేసేవాడిని. అలా కొంతకాలం డ్యాన్స్ ట్యూషన్స్ కూడా నిర్వహించాను. అలా వచ్చిన డబ్బును ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ కోర్సు చేయడానికి ఉపయోగించాను. కానీ మనీ సరిపోయేది కాదు. అప్పుడు విజయ్ అనే నటుడి ఇంట్లో వంట మనిషిగా కూడా పనిచేశాను అంటూ చెప్పుకొచ్చాడు చంద్ర…ఇప్పుడు మినిమమ్ ఒక్క షోకు 2 లక్షలు తీసుకుంటున్నాడని సమాచారం.. నిజంగా గ్రేట్ కదా..

Exit mobile version