Site icon NTV Telugu

Challa Dharma Reddy : గృహలక్ష్మి ఇండ్లను నిర్మించిన ఏకైక నియోజకవర్గం పరకాల..

Challa Dharma Reddy

Challa Dharma Reddy

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదవాడి సొంతింటికల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారలను అభయ హస్తం పథకంలో ఇందిరమ్మ ఇళ్లు జాబితాలో చేర్చాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గృహలక్ష్మి పథకంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఆరు గ్యారేంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో చేర్చి బిల్లులు చెల్లించాలని కోరారు. పార్టీలకు అతీతంగా, జిల్లా కలెక్టర్లు, అధికారుల ప్రత్యక్షంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభం చేసిన వారికి మంజూరు పత్రాలు అందజేయడం జరిగింది.

Merugu Nagarjuna: పురంధేశ్వరి టీడీపీ బీ-టీం.. ఆమె మాటలకు విలువ లేదు..

లబ్ధిదారులు ఉన్న ఇండ్లను కూల్చేసి,అప్పోసొప్పో చేసి నూతన ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులను ఇండ్లను రద్దు చేయడం సరికాదని అన్నారు.గృహలక్ష్మి పథకంలో నిర్మాణ దశలో ఉన్న ఇండ్ల లబ్ధిదారులను రద్దు చేయొద్దని కోరారు.ఈ విషయంలో సిఎం రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పునరాలోచన చేయాలని కోరారు. లబ్ధిదారులకు న్యాయం చేయకుంటే వారికి అండగా ఉండి వారి పక్షాన పోరాడతామని హెచ్చరించారు.ఒక్క పరకాల నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు నిర్మాణం ఎక్కువగ చేపట్టారన్నారు.కాకుంటే మళ్లీ అధికారులతో పునః పరిశీలన చేసి లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

YS Jagan: మోసాలు చేసి కుటుంబాలను చీలుస్తారు.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version