Chaadarghat Shooting Case: చాదర్‌ఘట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పుల కేసు ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బషీర్బాగ్‌లో నిన్న డీసీపీల సమావేశానికి చైతన్య హాజరయ్యారు. సమావేశ అనంతరం తిరిగి సైదాబాద్ లోని తన కార్యాలయానికి బయలుదేరారు. కోఠి దగ్గర ఓ స్నాచింగ్ ముఠా ఓ వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్ చోరీ చేస్తున్న విషయాన్ని డీసీపీ డ్రైవర్ గమనించారు. స్నాచింగ్ చేసి ఆటోలో పరార్ అవుతున్న ముగ్గురు నిందితుల గురించి డీసీపీకి చెప్పారు. డీసీపీ ఆదేశంతో ఆటోను వెంబడించారు డీసీపీ డ్రైవర్.. పోలీసులు వెంబడిస్తున్న విషయాన్ని నిందితులు గుర్తించారు. దీంతో నిందితుడు మహమ్మద్ ఒమర్ అన్సారి ఆటో నుంచి దూకి పరారయ్యారు. మహమ్మద్ అమర్ అన్సారీని డీసీపీ గన్మెన్, డీసీపీ వెంబడించారు. ఒమర్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు గన్‌మెన్ మూర్తి.. మూర్తిని తోసేసి పరారయ్యాడు నిందితుడు.. అదే సమయంలో గన్మెన్ మూర్తి వెపన్ కిందపడింది.
READ MORE: Jubilee Hills by-Election: స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన ఈసీ.. బీఆర్ఎస్‌కి బిగ్ షాక్..
గన్ మెన్ పట్టు విడవకుండా ఒమర్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకునే క్రమంలో గన్మెన్ & డీసీపీ కిందపడ్డారు. గన్మెన్ పై కత్తితో ఒమర్ దాడి చేస్తుండగా డీసీపీ పక్కకు నెట్టారు. అదే సమయంలో తన వద్ద ఉన్న కత్తితో గన్మెన్ పైకి దాడికి యత్నించాడు నిందితుడు. వెంటనే అప్రమత్తమై ఫైర్ ఓపెన్ చేసిన డీసీపీ చైతన్య.. మేజర్ ఇంజురీస్ కాకుండా కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం నిందితుడు ఒమర్ గన్మెన్ పైకి దాడికు యత్నించాడు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసుల కేసు నమోదు దర్యాప్తు ముమ్మరం చేశారు. Bns 304,109,132 సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
READ MORE: Pakistan Debt Crisis: పేదరికంలో నయా రికార్డు..! పాకిస్థాన్‌ను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న షాబాజ్..
