NTV Telugu Site icon

DSC : రేపటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

Tgdsc

Tgdsc

తెలంగాణలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (సెప్టెంబర్ 30) విడుదల చేశారు. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన, దసరా పండుగకు ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు. సీఎం ప్రకటించిన ప్రకారం, టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. పూర్తి సమాచారం కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు.

 NTV Effect : ఎన్టీవీ వార్త కు స్పందన.. సీఎంఆర్‌ ధాన్యం పక్కదారిపై మంత్రి “తుమ్మల”కన్నెర్ర

సీఎం రేవంత్ రెడ్డి, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఫలితాలను ప్రకటించారు. గత ప్రభుత్వంలో పదేళ్లలో కేవలం 7,000 పోస్టులే భర్తీ చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు, అయితే తమ ప్రభుత్వం కేవలం 10 నెలలలో 11,062 పోస్టులను భర్తీ చేస్తూ 56 రోజుల్లో ఫలితాలు విడుదల చేయగలిగింది. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు.

Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య

తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 65,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో గ్రూప్-1 ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు గ్రామీణ విద్యను నిర్లక్ష్యం చేసినందున, తాము ఆ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తున్నామని, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని చేసిన సాకులను ఖండించారు. గత ప్రభుత్వానికి చెందిన అన్ని అనుకూల పద్ధతులను తొలగిస్తామని, గ్రామీణ విద్యకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

Show comments