NTV Telugu Site icon

Security Risk: హై రిస్క్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్లు.. ఏం చేయాలంటే?

Security Risk Android Users

Security Risk Android Users

CERT-In Warning for Android Users: ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను వినియోగిస్తున్న వారికి కేంద్ర సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా’ (సెర్ట్‌-ఇన్‌) కీలక హెచ్చరిక చేసింది. ఆండ్రాయిడ్‌ ఓఏస్ (ఆపరేటింగ్‌ సిస్టమ్‌)లోని కొన్ని వెర్షన్లలో పలు లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్న సెర్ట్‌-ఇన్‌.. వీటితో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌లలో సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆండ్రాయిడ్‌ 12, 12L, 13, 14 కంటే ముందు ఉన్న వెర్షన్‌లు ప్రభావితమవుతాయని సెర్ట్‌-ఇన్‌ తమ ప్రకటనలో వెల్లడించింది. ఫ్రేమ్‌వర్క్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, కెర్నల్, ఆర్మ్, మీడియాటెక్ మరియు క్వాల్‌కామ్ కాంపోనెంట్‌లలో లోపాల కారణంగా ఈ సమస్యలు వచ్చినట్లు తెలిపింది. వీటిని ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు మొబైల్‌ ఫోన్లలో పాస్‌వర్డ్‌లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగలించే అవకాశముందని సెర్ట్‌-ఇన్‌ హెచ్చరించింది. ఈ లోపాల నుంచి ఫోన్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు ఆండ్రాయిడ్‌ యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

Also Read: OnePlus Nord 4 Price: లాంచ్ ఈవెంట్‌కు ముందే ధర లీక్.. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 కంటే తక్కువ!

అప్‌డేట్‌ చేసుకోవడానికి.. ముందుగా డివైజ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సిస్టమ్ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత సిస్టమ్ అప్‌డేట్‌పై క్లిక్‌ చేసి.. ఏదైనా అప్‌డేట్‌ ఉంటే దాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆపై డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సూచనలు పాటిస్తూ దాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలి.